News January 3, 2025

యువరాజ్-ఫ్లింటాఫ్ క్లాష్ రిపీట్!

image

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్సులో కోన్స్టస్- బుమ్రా మధ్య జరిగిన గొడవను 2007 T20 WCలో యువరాజ్- ఫ్లింటాఫ్ గొడవతో నెటిజన్లు పోల్చుతున్నారు. ఆ ఇన్నింగ్స్‌లో ఫ్లింటాఫ్‌పై ఉన్న కోపాన్ని యువరాజ్ బౌలర్ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన కోపాన్ని ఖవాజాను ఔట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

Similar News

News January 16, 2026

12,000 మంది మృతి.. ఎక్కడికక్కడ శవాల గుట్టలు!

image

ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో 12 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మెషీన్ గన్లతో పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. వందల మృతదేహాలు ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లాలని లేదంటే సామూహిక సమాధి చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిన్నటి నుంచి కాల్పులు ఆగినట్లు US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

News January 16, 2026

రేపు కాకినాడ.. ఎల్లుండి అమరావతిలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు కాకినాడలో పర్యటించి అమ్మోనియం ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్లుండి ఆయన అమరావతిలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. ఈ నెల 19న సీఎం దావోస్ పర్యటనకు వెళ్తారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూర్ ఉండనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న విషయం తెలిసిందే.

News January 16, 2026

మరియా గొప్ప మహిళ: ట్రంప్

image

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మరియాతో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. చాలా కష్టాలను ఎదుర్కొన్న ఆమె గొప్ప మహిళ అని కొనియాడారు. తాను చేసిన కృషిని గౌరవిస్తూ నోబెల్ శాంతి బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవానికి ఇదో గొప్ప సూచిక అని చెప్పారు. ఈ సంద్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.