News September 22, 2025

యువరాజ్ శిక్షణలో రాటుదేలి.. బ్రహ్మోస్‌లా విరుచుకుపడ్డాడు

image

టీమ్ ఇండియా చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ నిన్న పాకిస్థాన్‌పై ‘బ్రహ్మోస్’ క్షిపణిలా విరుచుకుపడ్డారు. గతంలో పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన యువరాజ్ సింగ్ శిక్షణలో రాటుదేలిన అభిషేక్.. పాక్ బౌలర్లను షేక్ చేశారు. అద్భుతమైన ఆటతీరుతో పాక్‌కు మ్యాచును దూరం చేశారు. అంతేకాదు ఆ జట్టు బౌలర్లు కవ్విస్తే తగ్గేదే లే అంటూ బ్యాటుతోనే జవాబిచ్చారు. పాక్‌పై లీగ్ స్టేజీలోనూ అభిషేక్ (13 బంతుల్లో 31) అదరగొట్టారు.

Similar News

News January 22, 2026

‘పక్క స్థలం కొంటున్నారా? భయం వద్దు!’

image

తూర్పు/ఉత్తరం వైపు ఇల్లు ఉన్నవారు పడమర, దక్షిణం వైపు స్థలాన్ని కొనకూడదనే అపోహ ఉంది. అయితే ఆ అపోహ తప్పని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు స్పష్టం చేస్తున్నారు. వాస్తు నియమాల ప్రకారం.. ఇలాంటి అవకాశం రావడం అదృష్టమని చెబుతున్నారు. ‘అయితే కొత్తగా కలిసిన స్థలంలో నైరుతి భాగం ఎత్తుగా ఉంచి, తూర్పు/ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదిలేలా మార్పులు చేయాలి. అది గొప్ప ఫలితాలను ఇస్తుంది’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 22, 2026

VSR రీఎంట్రీ.. ఏ పార్టీలోకి?

image

AP: రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు <<18928068>>విజయసాయి రెడ్డి<<>> ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారనే అంశంపై చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు, తన మాజీ బాస్ వైఎస్ జగన్‌పై విమర్శలు చేసిన ఆయన టీడీపీ, వైసీపీలో చేరే ఆస్కారం లేదనే టాక్ విన్పిస్తోంది. ప్రధాని, కేంద్ర మంత్రులతో సన్నిహితంగా ఉండే ఆయన బీజేపీలో చేరే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. VSR ఏ పార్టీలో చేరతారని మీరు అనుకుంటున్నారు.

News January 22, 2026

లిక్కర్ స్కామ్‌ గురించి రాజ్ కసిరెడ్డికే తెలుసు: విజయసాయి

image

AP: లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని EDకి చెప్పినట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మిథున్ రెడ్డి కోరిక మేరకే రాజ్ కసిరెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశానన్నారు. మిథున్ సూచనతోనే అరబిందో నుంచి నిధులు సమకూర్చినట్లు వెల్లడించారు. సజ్జల శ్రీధర్, కసిరెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఇవాళ HYDలో ED ఆయన్ను 7 గంటలకు పైగా విచారించింది.