News August 20, 2024
తెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్

భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఆయన క్రీడా ప్రయాణాన్ని మూవీగా తీసుకురానున్నట్లు Tసిరీస్ అధికార ప్రకటన వెల్లడించింది. ఈ సినిమాలో యువరాజ్ సింగ్ అద్వితీయ క్రికెట్ ప్రయాణం, ఆయన పాత్ర వంటి అంశాల నేపథ్యంలోనే సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 2007 టీ20WC, 2011 వరల్డ్ కప్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించారు. క్యాన్సర్‌తో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
Similar News
News October 22, 2025
మరో సినిమాపై కాపీరైట్ కేసు వేసిన ఇళయరాజా

లెజెండరీ మ్యూజీషియన్ ఇళయరాజా మరోసారి కాపీరైట్ ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘Dude’ చిత్రంలో ‘కరుత్త మచ్చాన్’ సాంగ్‌ను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ చిత్రయూనిట్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో మేకర్స్, సంగీత దర్శకులు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ, కూలీ, మంజుమ్మల్ బాయ్స్, మిసెస్ & మిస్టర్ సినిమాలపై కాపీరైట్ కేసు వేసిన విషయం తెలిసిందే.
News October 22, 2025
ఉస్మానియా వర్సిటీలో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టులు

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్లలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పీజీ, పీహెచ్డీ లేదా నెట్/సెట్/SLET అర్హతగలవారు ఈ నెల 28లోగా ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్& సోషల్ సైన్సెస్‌లో ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, ఫిలాసఫీ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 22, 2025
రాణీ అహల్యాబాయి.. అందరికీ ఆదర్శం

మాల్వాను పాలించిన రాణీ అహల్యాబాయి హోల్కర్ ఆదర్శ పాలకుల్లో ఒకరు. 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో భర్త ఖండేరావు, 1767లో కుమారుడు మలేరావు మరణించడంతో 1795 వరకు ఇండోర్‌ను పాలించారు. అహల్యాబాయి పాలనాకాలం మరాఠా సామ్రాజ్యపు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఆమె పునరుద్ధరించారు. అహల్యాబాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది.