News February 2, 2025
అభిషేక్ ఇన్నింగ్సుపై యువరాజ్ ట్వీట్

ఇంగ్లండ్‌పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను అతని కోచ్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ప్రశంసల్లో ముంచెత్తారు. అద్భుతంగా ఆడావని కొనియాడారు. ఇదే ఆటను తాను చూడాలనుకున్నానని, గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ మ్యాచులో 37 బంతుల్లో సెంచరీ చేసిన అభి, మొత్తంగా 54 బాల్స్‌లో 13 సిక్సర్లతో 135 రన్స్ చేశారు.
Similar News
News November 27, 2025
టీమ్ ఇండియా సెలక్షన్‌పై CV ఆనంద్ అసంతృప్తి

భారత క్రికెట్ పరిస్థితిపై TG హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో భారత్‌లో ప్రత్యర్థులు గెలవడం అరుదుగా జరిగేదని.. ప్రస్తుతం భారత ప్లేయర్లు స్వదేశంలోనే స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రంజీలు ఆడకపోవడం, IPL ఆధారంగా సెలక్షన్ జరగడం దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. రంజీలో రాణిస్తున్న ఆటగాళ్లను పక్కనబెట్టడం సెలక్షన్లో పక్షపాతానికి నిదర్శనమన్నారు.
News November 27, 2025
ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: మంచు లక్ష్మి

నటి మంచు లక్ష్మి తన కుటుంబంలో జరిగిన విభేదాలపై తొలిసారి స్పందించారు. దేవుడు వరం ఇస్తే కుటుంబం మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటానని తెలిపారు. భారతీయ కుటుంబాల్లో గొడవలు సహజమని, కానీ చివరికి అందరూ ఒక్కటిగా ఉండటం ముఖ్యమన్నారు. గొడవల గురించి తాను బాధపడలేదన్న వార్తలు తప్పు అని, ఆ సమయంలో తీవ్రమైన మానసిక వేదన అనుభవించినప్పటికీ బయటపెట్టలేదని తెలిపారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టపడనని అన్నారు.
News November 27, 2025
లోకేశ్ విమాన ప్రయాణాలపై TDP క్లారిటీ.. YCP కౌంటర్

AP: మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బులు వాడారన్న విమర్శలపై ఆర్టీఐ వివరాలతో TDP క్లారిటీ ఇచ్చింది. 77 సార్లు ప్రత్యేకంగా విమానాల్లో ప్రయాణించినా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని పేర్కొంది. ప్రయాణాలన్నింటికీ లోకేశ్ సొంత సొమ్ము వెచ్చించినట్లు సంబంధిత వివరాలను షేర్ చేసింది. అదే నిజమైతే బ్యాంక్ స్టేట్మెంట్ను బయట పెట్టాలంటూ YCP కౌంటర్ ఇచ్చింది.


