News March 18, 2025

YV సుబ్బారెడ్డి తల్లికి YS విజయమ్మ నివాళి

image

రాజ్యసభ సభ్యుడు ఒంగోలు మాజీ ఎంపీ YV సుబ్బారెడ్డి తల్లి ఏరం పిచ్చమ్మ పార్థివదేహానికి సోమవారం YS విజయమ్మ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పిచ్చమ్మతో ఉన్న అనుబందాన్ని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పిచ్చమ్మ అంత్యక్రియలు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి.

Similar News

News February 21, 2026

బుట్టాయిగూడెంలో కారు ఢీకొని వృద్ధుడు మృతి

image

బుట్టాయిగూడెం మండలం నందాపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి దాటుతున్న పాయల సుబ్బారావు (60) అనే వ్యక్తిని వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ సుమారు 100 కి.మీ. వేగంతో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సుబ్బారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 21, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* మచిలీపట్నంలో ట్యూబ్ లైట్‌తో ఫ్రెండ్‌ని పొడిచిన యువకుడు
* గన్నవరంలో ఫ్లైట్ నిలిపివేత.. ప్రయాణికుల ఆందోళన
* కురుమద్దాలి వద్ద ప్రమాదం.. ఒకరి మృతి
* విజయవాడలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
* 22న గన్నవరంలో టెన్నిస్ బాల్ క్రికెట్ జట్లు ఎంపిక
* కృష్ణాజిల్లా పోలీసులకు మంత్రి లోకేశ్ ప్రశంసలు
* నందిగామలో పెళ్లి బస్సు డ్రైవర్ గుండుపోటుతో మృతి
* విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం

News February 21, 2026

నంద్యాల: బీటెక్ విద్యార్థి మృతి

image

నంద్యాల సమీపంలోని పొన్నాపురం వద్ద రైలు పట్టాలపై బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు శనివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు బేతంచెర్లకు చెందిన విజయ్ కుమార్(27)గా గుర్తించారు. కర్నూలులోని KV సుబ్బారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.