News September 27, 2024

లడ్డూ వివాదంపై వైవీ పిటిషన్.. 4న సుప్రీంకోర్టులో విచారణ

image

AP: తిరుమల లడ్డూపై వివాదంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 4న అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు ఏర్పాటుచేసిన సిట్‌తో వాస్తవాలు వెలుగులోకి రావని, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరగాలని ఆయన కోరుతున్నారు.

Similar News

News September 27, 2024

చంద్రబాబును బీజేపీ ఎందుకు మందలించడం లేదు?: జగన్

image

AP: బీజేపీ అగ్రనేతలపై YCP అధినేత జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘హిందూయిజానికి తామే ప్రతినిధులమని BJP నేతలు చెప్పుకుంటారు. మీ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుమల లడ్డూ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి వైభవాన్ని అబద్ధాలతో నాశనం చేస్తున్నారు. కొవ్వు ఉన్న నెయ్యి వాడకపోయినా వాడినట్లు చెబుతున్న చంద్రబాబును ఎందుకు మందలించడం లేదు? మీ వాళ్లు ఏంచేసినా ఫర్వాలేదా? ఇదెక్కడి హిందూయిజం?’ అని నిలదీశారు.

News September 27, 2024

చంద్రబాబు చేసిన పాపం ప్రజలపై పడకుండా పూజలు చేయాలి: జగన్

image

AP: మానవత్వం చూపేదే హిందూ మతమని, మానవత్వం చూపనివాళ్లు తాము హిందువని చెప్పుకోలేరని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ‘తిరుమల గొప్పదనాన్ని, లడ్డూ విశిష్టతను చంద్రబాబే నాశనం చేశారు. నన్ను గుడికి పంపినా, పంపకపోయినా CBN చేసిన పాపం ప్రజల మీద పడకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గంలో పూజలు నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు.

News September 27, 2024

గ్రేటర్‌లో వాటిపై నిషేధం విధించిన ఆమ్రపాలి

image

TG: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో గోడలపై పోస్టర్లు, పెయింటింగ్స్, వాల్ రైటింగ్స్ వేయడంపై నిషేధం విధించారు. అనుమతులు లేకుండా ఏమైనా చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సినిమా వాళ్లు సైతం అనుమతులతో వాల్ పోస్టర్లు వేయాలన్నారు. ఈ అంశంపై లోకల్ ప్రింటర్స్‌తో మాట్లాడాలని డిప్యూటీ కమిషనర్లను ఆమె ఆదేశించారు.