News September 23, 2024

లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వైవీ సుబ్బారెడ్డి

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మ.2:15 గంటలకు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.

Similar News

News November 19, 2025

టికెట్లు బుక్ చేసుకున్నారా?

image

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శించుకునే అదృష్టం లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి లభిస్తుంది. అందుకు సంబంధించి ఫిబ్రవరి కోటా సేవా టికెట్లు నిన్న విడుదలయ్యాయి. TTD అధికారిక వెబ్‌సైట్‌లో రేపు ఉ.10 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు స్వామివారికి అతి చేరువలో ఉంటూ, కొన్ని నిమిషాల పాటు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ☞ టికెట్ ధరలు, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News November 19, 2025

ఈ హెయిర్ ‌స్టైల్స్‌తో హెయిర్‌ఫాల్

image

కొన్నిరకాల హెయిర్‌స్టైల్స్‌తో కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గి హెయిర్‌ఫాల్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీటెయిల్స్, కార్న్‌రోస్, బన్స్, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అలోపేషియాకు కారణమవుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ పేర్కొంది. గట్టిగా బిగిస్తే కుదుళ్లు బలహీనమై జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు హాని కలిగించని హెయిర్​స్టైల్స్​ ప్రయత్నించాలని సూచించారు.

News November 19, 2025

సేవలు – ధరలు – ఇతర వివరాలు

image

☞ సుప్రభాత సేవ: ఉ.3 గంటలకు ఉంటుంది. రోజుకు 250-300 టికెట్లు ఉంటాయి. ధర ₹120.
☞ తోమాల సేవ: సుప్రభాత సేవ తర్వాత ఉ.3.30కి ఉంటుంది. మంగళ, బుధ, గురు వారాల్లో 10 చొప్పున టికెట్లు మాత్రమే ఉంటాయి. ధర ఒక్కొక్కరికి ₹220.
☞ అర్చన సేవ: ఇది కూడా మంగళ, బుధ, గురు వారాల్లో 10 టికెట్లు మాత్రమే ఉంటాయి. టికెట్ ప్రైజ్ ₹220.
☞ అష్టదళ పాద పద్మారాధన: మంగళవారం మాత్రమే ఉండే ఈ సేవకు 60 టికెట్లు ఉంటాయి. ధర ₹1,250.