News March 18, 2025

YV సుబ్బారెడ్డి తల్లికి YS విజయమ్మ నివాళి

image

రాజ్యసభ సభ్యుడు ఒంగోలు మాజీ ఎంపీ YV సుబ్బారెడ్డి తల్లి ఏరం పిచ్చమ్మ పార్థివదేహానికి సోమవారం YS విజయమ్మ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పిచ్చమ్మతో ఉన్న అనుబందాన్ని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పిచ్చమ్మ అంత్యక్రియలు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి.

Similar News

News December 15, 2025

సర్పంచ్ రిజల్ట్స్.. ‘టాస్‌’తో గెలిచారు

image

TG: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చాయి. నల్గొండలోని మంగాపురంలో ఉపేంద్రమ్మకు, మౌనికకు సమానంగా ఓట్లు రాగా టాస్ వేయడంతో ఉపేంద్రమ్మకు పదవి వరించింది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డిలో సంతోశ్, మానయ్యకు 483 ఓట్ల చొప్పున పోల్ అవ్వగా టాస్ వేసిన అధికారులు సంతోశ్‌ను విజేతగా ప్రకటించారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రావడంతో అధికారులు డ్రా తీసి విజేతలను నిర్ణయించారు.

News December 15, 2025

నేడు సర్వ ఏకాదశి.. మోక్షం కోసం ఏం చేయాలంటే?

image

మార్గశిర కృష్ణ పక్ష ఏకాదశినే సర్వ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువును ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా మోక్షం లభిస్తుందని చెబుతున్నారు. ‘దానాలు చేయడం వల్ల ఆత్మ శుద్ధి జరుగుతుంది. చేసే పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం పాటించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. వ్రతాలు ఆచరించడం మరింత శ్రేయస్కరం. మనస్ఫూర్తితో విష్ణుమూర్తిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది’ అంటున్నారు.

News December 15, 2025

మిరుదొడ్డి: గొర్రెల కాపరి నుంచి ఉపసర్పంచిగా..

image

సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం ఇది. రెండో విడత స్థానిక ఎన్నికల్లో గొర్రెల కాపరిగా జీవనం సాగించిన పెద్ద కురుమ కరుణాకర్ మిరుదొడ్డి మేజర్ గ్రామపంచాయతీకి ఉపసర్పంచిగా ఎన్నికయ్యారు. 7వ వార్డు నుంచి అధిక మెజార్టీతో గెలుపొందిన ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అండగా ఉండి, సేవ చేస్తానని భరోసా ఇచ్చారు. సాధారణ నేపథ్యం నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన కరుణాకర్ ప్రశంసలు అందుకుంటున్నారు.