News October 21, 2024
YVUలో నేటి నుంచి డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు

యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ ఒకేషనల్ 2వ సెమిస్టర్ పరీక్షలు, నేటినుంచి నిర్వహించనున్నట్లు YVU పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య ఎన్ ఈశ్వరరెడ్డి తెలిపారు. MLT, డైరీ సైన్స్ చదివే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈనెల 28వ తేదీ వరకు ప్రతిరోజు (27వ తేదీ మినహ) ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
Similar News
News December 17, 2025
కడప: శ్రీచరణికి రూ.2.5కోట్ల చెక్ అందజేత

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మన కడప జిల్లా మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత చెక్కును మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉండవల్లిలో బుధవారం ఆమె అందుకున్నారు. కడపలో ఇంటి స్థలం, గ్రేడ్ వన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఆమెకు ఇవ్వనున్న విషయం తెలిసిందే.
News December 17, 2025
కడప జిల్లాలో ‘ఫేస్ వాష్ అండ్ గో’

కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రాత్రి వేళ పలుచోట్ల వాహనాలను నిలిపారు. లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లకు నీరు అందించి ఫేస్ వాష్ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
News December 17, 2025
కడప: పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య..?

ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. చాగలమర్రి(M) గోట్లూరుకు చెందిన యువకుడు(24) మెకానిక్ పనిచేస్తుంటాడు. నంద్యాల జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిర్ణయించారు. బ్యాంకులో పని ఉందని సోమవారం ఇంట్లో వాళ్లకు చెప్పి యువకుడు బయటకు వచ్చాడు. రాజుపాలెం మండలం వెల్లాల పొలాల్లోకి వచ్చి విషం తాగి చనిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


