News March 23, 2025
YVU: ‘ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి’

వైవీయూ వీసీ అల్లం శ్రీనివాసరావుని YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.విశ్వనాధ కుమార్, కులసచివులు ఎన్. రాజేశ్ కుమార్ రెడ్డి కడప సీపీ బ్రౌన్‌లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్చం అందజేశారు. యోగి వేమన యూనివర్సిటీ కంట్రోల్‌లో ఉన్న గురుకుల భవనాలలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని నిర్వహించుకొనుటకు అనుమతించవలసినదిగా కోరామన్నారు.
Similar News
News March 25, 2025
కడప: భార్యను చంపిన భర్త.. అనంతరం సూసైడ్

కడప జిల్లా వల్లూరు మండలంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. అంబవరం ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఎర్రగుడిపాడు చెన్నకేశవ భార్య సుజాతను విచక్షణా రహితంగా కత్తితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం చెన్నకేశవ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కమలాపురం సీఐ రోషన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2025
కడప జడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం: వాసు

త్వరలో జరగనున్న కడప జడ్పీ ఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఎన్నికల్లో పోటీచేయలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. తమ పార్టీకి సంఖ్యాబలం లేదని అందుకే పోటీ చేయడం లేదన్నారు. అటు చంద్రబాబు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారన్నారు. కాగా కడపలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వైసీపీకి 42, టీడీపీ6గా సంఖ్యా బలం ఉంది.
News March 25, 2025
కడప: వాట్సాప్‌లో పదో తరగతి పేపర్ లీక్

కడప(D) వల్లూరు సెంటర్‌లో సోమవారం జరిగిన గణితం పరీక్షా పేపర్ లీక్ అయిందని డీఈవో షంషుద్ధీన్ స్పష్టం చేశారు. వేంపల్లె జిల్లా పరిషత్ పాఠశాల బీ కేంద్రంలో తనిఖీలు చేస్తుండగా మ్యాథ్స్ పేపర్ వాట్సాప్‌లో షేర్ అయింది. వల్లూరు స్కూల్లో వాటర్ బాయ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి పంపాడు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు.