News April 19, 2024

YVU: రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ, బిఏ, బీకాం, బి.బి.ఏ, బి.సి.ఎ, ఒకేషనల్ 1,2,4,6 సెమిస్టర్ల పరీక్షలు శనివారం నుంచి జిల్లాలోని 57 కేంద్రాలలో ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపార. మట్లాడుతూ.. 31,830 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. విద్యార్థులు సంబంధిత కళాశాల నుంచి హాల్ టికెట్లు పొందాలన్నారు. 

Similar News

News February 23, 2026

28న వైవీయూ హ్యాండ్ బాల్ జట్టు కోసం సెలక్షన్ ట్రయల్స్

image

యోగి వేమన యూనివర్శిటీ హ్యండ్ బాల్ స్త్రీ, పురుషుల జట్ల కోసం డైరెక్ట్ సెలక్షన్ ట్రయల్స్ విశ్వవిద్యాలయ వేమన క్రీడా ప్రాంగణంలో ఈ నెల 28 వతేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ క్రీడా బోర్డు సెక్రటరి డా. రామ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైవీయూ అనుబంధ సంస్థలలో చదువుతూ ఉండాలన్నారు. క్రీడాకారుల వయసు 17 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలన్నారు. వివరాలకు 6281689398 నంబరును సంప్రదించాలన్నారు.

News February 23, 2026

వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

image

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.

News February 23, 2026

పులివెందులకు YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

image

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 25న పర్యటించే షెడ్యూల్‌ను వైసీపీ వర్గాలు తెలిపాయి. ఉదయం 9:30 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి 10:30కి వేంపల్లి మండలం నంది పల్లె నందీశ్వర ఆలయానికి చేరుకుంటారు. తిరిగి 11:30కి అక్కడి నుంచి బయలుదేరి 12:30కి బాకరాపురం చేరుకొని మధ్యాహ్నం 2:30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. 2:30 నుంచి 6: 25 వరకు క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. 6:30కి ఇంటికి చేరుకొని అక్కడే బసచేస్తారు.