News March 23, 2025
YVU: ‘ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి’

వైవీయూ వీసీ అల్లం శ్రీనివాసరావుని YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.విశ్వనాధ కుమార్, కులసచివులు ఎన్. రాజేశ్ కుమార్ రెడ్డి కడప సీపీ బ్రౌన్‌లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్చం అందజేశారు. యోగి వేమన యూనివర్సిటీ కంట్రోల్‌లో ఉన్న గురుకుల భవనాలలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని నిర్వహించుకొనుటకు అనుమతించవలసినదిగా కోరామన్నారు.
Similar News
News March 30, 2025
కొండాపురం : తల్లిదండ్రుల మృతి.. అనాధలుగా పిల్లలు..!

కొండాపురంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగి రామ్మోహన్, సరోజ దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. మిగిలిన కుమార్తె బీటెక్ సెకండ్ ఇయర్, కొడుకు ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. వీరు అద్దె ఇంట్లో ఉంటున్నారు. దీంతో పిల్లలు అనాధలుగా మిగిలారని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
News March 30, 2025
కడప: పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందించేలా విధులు.!

పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని జిల్లా SP అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో, నెలవారీ నేర సమీక్షా నిర్వహించారు. జిల్లాను గంజాయి, ఇతర నిషేదిత మత్తు పదార్థాల రహితంగా చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
News March 30, 2025
కడప జిల్లా ప్రజలకు SP ఉగాది& రంజాన్ శుభాకాంక్షలు.!

కడప జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ “శ్రీ విశ్వావసు” నామ సంవత్సర ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగతోనే ఆరంభం అవుతుందని, ఉగాది పేరులోనే ఏడాది ప్రారంభమని అర్థం ఉందని తెలిపారు. ఉగాది మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్నీ తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.