News February 26, 2025

ZADRAN: ఇది కదా హీరోయిజం అంటే..!

image

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ (177) భారీ సెంచరీతో చెలరేగారు. కాగా జద్రాన్ గాయం కారణంగా 6 నెలలు క్రికెట్‌కు దూరమయ్యారు. గతేడాది చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత రికవరీ అయిన జద్రాన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతున్నారు. ఏకంగా అఫ్గాన్ తరఫున అత్యధిక స్కోరు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కారు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.

Similar News

News January 22, 2026

260 మృతి ఘటన.. సంచలన రిపోర్ట్!

image

అహ్మదాబాద్‌లో గతేడాది కుప్పకూలి 260 మంది మృతికి కారణమైన ఎయిరిండియా బోయింగ్ 787కు సంబంధించి USకు చెందిన ఓ NGO సంచలన విషయాలు వెల్లడించింది. BBC కథనం ప్రకారం.. 2014లో సర్వీసులో చేరిన ఆ విమానంలో తొలిరోజు నుంచే సమస్యలు తలెత్తినట్లు అక్కడి సెనేట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇంజినీరింగ్, తయారీ, క్వాలిటీ, నిర్వహణ లోపాల వల్లే ఇవి తలెత్తినట్లు ఇంటర్నల్ డాక్యుమెంట్లలో గుర్తించామని తెలిపింది.

News January 22, 2026

Republic day Special: మేడం బికాజీ కామా

image

బొంబాయిలో పార్శీ కుటుంబంలో జన్మించిన బికాజీ కామా దాదాభాయ్‌ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల ప్రేరణతో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి చికిత్స కోసం లండన్‌ వెళ్లి అక్కడ భారతదేశ విప్లవకారులకు మార్గదర్శిగా మారారు. ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ని స్థాపించారు. ‘వందేమాతరం’ పత్రికను నడిపారు. 1907లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈమెను ‘భారత విప్లవకారుల మాత’గా అభివర్ణిస్తారు.

News January 22, 2026

OTTలోకి కొత్త సినిమాలు

image

ఇటీవల థియేటర్లలో విడుదలైన పలు కొత్త సినిమాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి OTTలోకి రానున్నాయి. ధనుష్, కృతిసనన్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ (తెలుగులో అమరకావ్యం) నెట్‌ఫ్లిక్స్‌లో, కిచ్చా సుదీప్ ‘మార్క్’ జియో హాట్‌స్టార్‌లో, శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన ’45’ మూవీ ZEE5లో స్ట్రీమింగ్‌ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శోభితా ధూళిపాళ్ల ‘చీకటిలో’ రానుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌లో ‘మోగ్లీ’ అందుబాటులోకి వచ్చింది.