News April 13, 2024
హిందూ వేడుక చేసుకున్న జహీర్ ఖాన్.. ఇస్లామిస్టుల దుర్భాషలు

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇటీవల తన భార్య సాగరికాతో కలిసి హిందూ పండుగ ‘గుడీ పడ్వా’ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేయగా, ఇస్లామిస్టులు దుర్భాషలాడారు. ‘జహీర్ మూర్ఖుడు. అతనికి ఇస్లాంపై విశ్వాసం బలహీనంగా ఉంది. తన భార్యను ఈ మతంలోకి మార్చలేకపోయాడు’ అని కొందరు కామెంట్ చేశారు. అన్ని మతాలను గౌరవించే దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Similar News
News April 9, 2026
రాజ్ లేకుండా ఒక్క రోజూ ఉండలేను.. సమంత ఎమోషనల్

తన భర్త రాజ్ గురించి చెబుతూ హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. ‘నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. తర్వాత నేను ఒక బెటర్ పర్సన్‌గా, బెటర్ యాక్ట్రెస్‌గా కావడానికి భర్త రాజ్ కారణం. మేం కలిసే వర్క్, వర్కవుట్స్ చేస్తాం. గేమ్స్ ఆడతాం. ఆయనను విడిచి నేను ఒక్క రోజు కూడా ఉండలేను’ అని పేర్కొన్నారు. కాగా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మే 15న విడుదల కానుంది.
News April 9, 2026
పాస్ పుస్తకాల్లో కరెన్సీకి వాడే టెక్నాలజీ: సీఎం

AP: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని, అది జీవనాధారం, భద్రత, గౌరవమని CM CBN చెప్పారు. YCP హయాంలో ప్రజల భూమిపై కన్నేశారని ఆరోపించారు. బాపట్ల(D) సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ సభలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పటికే 21.23L కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చాం. జులై నాటికి మరో 9 లక్షలు, 2027 మార్చికి 80 లక్షల పాస్ బుక్స్ అందిస్తాం. కరెన్సీకి వాడే టెక్నాలజీ ఇందులో వాడుతున్నాం. వీటిని ఎవరూ ట్యాంపర్ చేయలేరు’ అని చెప్పారు.
News April 9, 2026
‘ఆంటీ’ అన్నారని కోర్టుకు.. రూ.1.8 లక్షల ఫైన్

ఆంటీ అని పిలిచారని లండన్‌లో భారత సంతతి మహిళ ఇల్డా ఎస్టెవ్స్(61) కోర్టుకెక్కి విజయం సాధించారు. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్(NHS)లో నర్సుగా పనిచేస్తున్నారు. తనను పేరుతో పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తోటి ఉద్యోగి ఆంటీ అంటూ వేధించారని, ఇది వయో, లింగ వివక్ష కిందకి వస్తుందని కేసు పెట్టారు. విచారించిన కోర్టు ఆమెకు నష్టపరిహారంగా ₹1.8 లక్షలు చెల్లించాలని NHSను ఆదేశించింది.


