News October 19, 2024
LeT టెర్రరిస్టులతో జకీర్ నాయక్ భేటీ

భారత్ నుంచి పారిపోయిన వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ పాకిస్థాన్లో పర్యటిస్తున్నాడు. అక్కడ లష్కర్ ఏ తోయిబా(LeT) ఉగ్రవాదులు ఇక్బాల్ హష్మీ, మహ్మద్ ధర్, నదీమ్లను కలుసుకున్నాడు. భారీ బందోబస్తు మధ్య లాహోర్లో నిర్వహించిన సభలో 1,50,000 మందిని ఉద్దేశించి ప్రసంగించాడు. 2016 మనీలాండరింగ్ కేసు తర్వాత అతను మలేషియాకు మకాం మార్చిన విషయం తెలిసిందే. అతని ‘పీస్ టీవీ’పై భారత్, బంగ్లా, శ్రీలంకలో నిషేధం ఉంది.
Similar News
News December 7, 2025
రోహిత్, కోహ్లీలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే?

ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో పరుగుల వరదతో అభిమానులను అలరించిన రో-కో జోడీ మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో మైదానంలో అడుగుపెట్టనుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్కోట్, ఇండోర్లో న్యూజిలాండ్తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఆ సిరీస్ తర్వాత మళ్లీ జులైలో ENGతో మూడు వన్డేలు ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోన్న రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడనున్నారు.
News December 7, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⋆ కాంగ్రెస్ పాలనపై ‘ప్రజా వంచన దినం’ పేరిట HYD ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ధర్నా.. హామీలపై చర్చకు రావాలని CM రేవంత్కు కిషన్ రెడ్డి సవాల్
⋆ అసెంబ్లీ స్పీకర్కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. MLAల అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
⋆ ఈనెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షనా? CM జోక్యం చేసుకుని పరీక్షను వాయిదా వేయించాలి: కవిత
News December 7, 2025
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో ఉద్యోగాలు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(<


