News September 10, 2024

భారత్ రానున్న జెలెన్‌స్కీ?

image

ఈ ఏడాది చివరి నాటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ రాయబారి అలెగ్జాండర్ పోలిష్‌చుక్ తెలిపారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా జెలెన్‌స్కీని మోదీ ఆహ్వానించారని, అది జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తమ అధ్యక్షుడు కూడా ఇక్కడ పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

పార్వతీపురం: ‘పరిపాలనా యంత్రాంగం ఆరోగ్యం, శ్రేయస్సు ముఖ్యం’

image

జిల్లా పరిపాలనా యంత్రాంగం ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ముఖ్యమని, అందుకే ఈ ప్రత్యేక వైద్య శిబిరమని జిల్లా డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది ఆరోగ్యం చాలా ముఖ్యమని అన్నారు. ఆరోగ్యవంతమైన సిబ్బంది మాత్రమే సమర్థవంతంగా పనిచేయగలుగుతారన్నారు.

News December 2, 2025

ఈ సారి చలి ఎక్కువే: IMD

image

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.

News December 2, 2025

ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని CSIR-<>IICT<<>> 10 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, టెక్నీషియన్(జనరల్ నర్సింగ్/ANM), ఫార్మసీ టెక్నీషియన్, టెక్నీషియన్( క్యాటరింగ్&హాస్పిటాలిటీ) పోస్టులు ఉన్నాయి. నెలకు జీతం రూ.39,545 చెల్లిస్తారు. ట్రేడ్ టెస్ట్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in