News March 1, 2025

అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు: ట్రంప్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలె‌న్‌స్కీతో గొడవపై ట్రంప్ స్పందించారు. ఆయన వైట్‌హౌస్‌ బయట మీడియాతో మాట్లాడారు. ‘అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు. ఎప్పుడైతే ఆయన శాంతి స్థాపనకు సిద్ధపడతారో అప్పుడే మళ్లీ ఇక్కడికి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా అంతకుముందు ట్రంప్‌తో జెలె‌న్‌స్కీ వాగ్వాదానికి దిగడాన్ని US ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుబట్టారు. మీడియా ముందు తమ అధ్యక్షుడిని అగౌరవపరిచారని మండిపడ్డారు.

Similar News

News March 1, 2025

సెమీస్‌కు వెళ్లాలని సౌతాఫ్రికా.. పరువు కోసం ఇంగ్లండ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ మ.2.30 గంటలకు సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్-బిలో 3 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న SA ఇందులో గెలిచి సెమీస్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న ENG చివరి గేమ్‌లోనైనా గెలవాలని ఆరాటపడుతోంది. ఇప్పటికే AUS సెమీస్‌లో అడుగుపెట్టింది. ENG చేతిలో SA భారీ తేడాతో ఓడితే అఫ్గాన్‌ సెమీస్ చేరుతుంది.

News March 1, 2025

ట్రంప్‌తో గొడవ.. జెలెన్‌స్కీకి మద్దతుగా EU దేశాలు

image

ట్రంప్, జెలెన్‌స్కీ గొడవ నేపథ్యంలో అంతర్జాతీయంగా పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ ప్రజలు ఒంటరి కాదంటూ EU దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈమేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సహా పలు దేశాల ప్రధానులు, యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ కాజా కల్లాస్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ట్రంప్, EU మధ్య ‘సుంకాల’ వార్ నడుస్తుండగా తాజా గొడవ ఎక్కడికి దారి తీస్తుందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది.

News March 1, 2025

కేజ్రీవాల్ రావణుడు, ఆతిశీ శూర్పణఖ: BJP MLA

image

కేజ్రీవాల్, ఆతిశీని ఢిల్లీ BJP MLA గజేంద్ర యాదవ్ రావణుడు, శూర్పణఖతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు హతమవుతారు. కానీ శూర్పణఖ బతికిపోతుంది. ఇక్కడ కూడా ఓటమితో కేజ్రీవాల్, సిసోడియా రాజకీయ భవిష్యత్తు ముగిసింది. కానీ ఆతిశీ గెలిచారు. అందుకే ఆమె శూర్పణఖ లాంటివారు’ అని ఎద్దేవా చేశారు. ఇక తాము చేసే మంచిని చూసి ఆప్ నేతలెప్పుడూ ఏడుస్తూనే ఉంటారని ఆయన విమర్శించారు.

error: Content is protected !!