News April 14, 2025

ఉక్రెయిన్‌కు రండి.. ట్రంప్‌కు జెలెన్‌స్కీ ఆహ్వానం

image

US అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ సందర్శించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. రష్యా తమ దేశంలో చేసిన విధ్వంసం చూడాలన్నారు. యుద్ధంతో తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, మరణించిన, గాయపడిన ప్రజలు, దెబ్బతిన్న కట్టడాల్ని చూసిన అనంతరం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఫిబ్రవరిలో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య జరిగిన చర్చలు వాగ్వాదంతో అర్ధాంతరంగా ముగిశాయి.

Similar News

News November 25, 2025

ఇతిహాసాలు క్విజ్ – 77 సమాధానాలు

image

ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా ఇవ్వమని ఎందుకు అడిగాడు?
జవాబు: ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్క నోటిని బాణాలతో కుట్టి, దాన్ని మొరగకుండా చేశాడు. ఈ విలువిద్యను చూసిన ద్రోణుడు అతనికి అస్త్రాలను దుర్వినియోగం చేస్తాడని, విచక్షణా రహితంగా వాడే అవకాశముందని విలువిద్యకు కీలకమైన బొటనవేలుని గురుదక్షిణగా అడిగాడు. అలాగే అర్జునుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 25, 2025

బ్రెస్ట్ నుంచి స్రావాలు వస్తున్నాయా?

image

రొమ్ములనుంచి ఎలాంటి స్రావాలు వచ్చినా క్యాన్సర్ అని చాలామంది భావిస్తారు. అయితే ఇదీ ఒక క్యాన్సర్ లక్షణమే కానీ, అన్నిసార్లూ అదే కారణం కాదంటున్నారు నిపుణులు. గెలాక్టోరియా వల్ల కూడా ఇలా జరగొచ్చంటున్నారు. ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదల కావడం, హైపోథైరాయిడిజమ్‌, కణితులు, లోదుస్తులు బిగుతుగా ఉండటం వల్ల కూడా రొమ్ముల్లో నీరు రావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

News November 25, 2025

టాటా కొత్త SUV.. ధర రూ.11.49 లక్షలు

image

టాటా మోటార్స్ తన ఐకానిక్ మోడల్ <<18299496>>సియారా<<>>ను మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ SUV ధర రూ.11.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని, వచ్చే జనవరి 15 నుంచి డెలివరీలు షురూ చేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు ఉంటాయి. కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, గ్రాండ్ విటారా కార్లతో ఇది పోటీ పడనుంది.