News February 20, 2025

జెలెన్‌స్కీ ఓ నియంత: ట్రంప్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఉక్రెయిన్‌లో ఎన్నికల్ని నిర్వహించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారు. స్వదేశంలో ఆయనకు ప్రజాదరణ అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఎన్నికల్ని కూడా జరగనివ్వడం లేదు’ అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు. 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన జెలెన్‌స్కీ పదవీకాలం ముగిసిపోయినా యుద్ధం పేరు చెప్పి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Similar News

News December 9, 2025

ఇంట్లోని గుమ్మాలు, కిటికీల మాదిరిగానే స్థంభాలు కూడా సరి సంఖ్యలో ఉండాలా?

image

వాస్తు ప్రకారం గుమ్మాలు, కిటికీలతో స్థంభాలు భిన్నమైనవని, వీటి ఉపయోగాలు వేర్వేరని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘గుమ్మాలు, కిటికీలను గాలి, వెలుతురు కోసం చూస్తారు. కాబట్టి వాటి సంఖ్య విషయంలో నియమాలు ఉంటాయి. కానీ స్థంభాలు గోడల్లో కలిసిపోతాయి. పిల్లర్స్, బీమ్స్ అనేవి ఇంటి నిర్మాణంలో భవన పటిష్టతకు సంబంధించినవి. అవి సరి సంఖ్యలో ఉండాలనే నియమాలు లేవు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 9, 2025

TTD: మెరుగైన సేవలకు అభిప్రాయ సేకరణ

image

AP: మరింత మెరుగైన సేవల కోసం భక్తుల నుంచి TTD అభిప్రాయాలు సేకరిస్తోంది. IVRS ద్వారా వసతి, అన్నప్రసాదం సహా 17అంశాలపై సమాచారం తీసుకుంటోంది. తిరుమల, తిరుపతిలో పెట్టిన QR కోడ్లను స్కాన్ చేస్తే వచ్చే వాట్సాప్ నంబర్ 93993 99399లోనూ టెక్స్ట్/వీడియో ద్వారా భక్తుల నుంచి సమాచారం తెలుసుకుంటోంది. ప్రతినెల తొలి శుక్రవారం 0877-2263261 నుంచి డయల్ యువర్ EO ద్వారా సమస్యలు వింటూ సేవా నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తోంది.

News December 9, 2025

‘అఖండ-2’ రిలీజ్‌తో 17 సినిమాలపై ఎఫెక్ట్!

image

బాలయ్య ‘అఖండ-2’ సినిమా ఈనెల 12న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో ఈ వారాంతంలో 14 కొత్త, 3 రీరిలీజ్ సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఇవి ఇప్పటికే ప్రమోషన్లు పూర్తిచేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ-2’ చూపించే ప్రభావం దృష్ట్యా విడుదలను పోస్ట్‌పోన్ చేసుకుంటున్నాయి. ‘మోగ్లీ’, ‘అన్నగారు వస్తారు’, ‘డ్రైవ్’ వంటి సినిమాల విడుదలకు బాలయ్య మూవీ పెద్ద సవాలుగా మారింది. దీనిపై మీ కామెంట్?