News July 7, 2024

5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు జెప్టో ఆదాయం: CEO

image

2023 FYలో ₹2,000కోట్లుగా ఉన్న జెప్టో ఆదాయం ఏడాదిలోనే 5 రెట్లు పెరిగిందని ఆ కంపెనీ CEO ఆదిత్ పలిచా తెలిపారు. సరిగా వ్యాపారం చేస్తే ఇప్పుడున్న ₹10వేల కోట్ల ఆదాయాన్ని రాబోయే 5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు చేర్చగలమని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలో ప్రస్తుతం టాప్‌లో ఉన్న డీమార్ట్‌ను తాము 18-24 నెలల్లో అధిగమించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో JIIF ఫౌండేషన్ డే ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడారు.

Similar News

News January 17, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 17, 2025

శుభ ముహూర్తం (17-01-2025)

image

✒ తిథి: బహుళ చవితి తె.5.31 వరకు
✒ నక్షత్రం: మఖ మ.1.23 వరకు
✒ శుభ సమయం: సా.4.20-4.32 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు
✒ యమగండం: మ.3.00-4.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉ.8.24-9.12 వరకు
2.మ.12.24-1.12 వరకు
✒ వర్జ్యం: రా.9.29-11.40 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.51-12.31 వరకు

News January 17, 2025

BCCI కీలక నిర్ణయం.. ఆ సమయంలో షూటింగ్‌లు బంద్

image

టీమ్ ఇండియా ఆటగాళ్లపై BCCI మరిన్ని ఆంక్షలు విధించింది. సిరీస్‌లు జరుగుతుండగా ప్లేయర్లు ఎలాంటి షూటింగ్‌లు, ఎండార్స్‌మెంట్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో ఘోర ఓటమి అనంతరం ప్లేయర్లకు స్వేచ్ఛ ఎక్కువవడంతోనే ఫామ్ కోల్పోతున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సిరీస్ టూర్లకు వెళ్లినప్పుడు ఫ్యామిలీ కూడా ఎక్కువ సమయం వారితో ఉండకుండా ఆంక్షలు విధించేందుకు BCCI సిద్ధమైంది.