News February 5, 2025
వాళ్లందరికీ జీరో కరెంట్ బిల్: కేంద్రం
‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’ ద్వారా 45% మందికి జీరో కరెంట్ బిల్ వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని 8.64లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ చెప్పారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి దాదాపు రూ.77,800 కేంద్రం అందిస్తోందన్నారు. జీరో బిల్లు అనేది సోలార్ కెపాసిటీ, విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
Similar News
News February 5, 2025
వరల్డ్ రికార్డుపై షమీ కన్ను
రేపు ENGతో జరిగే తొలి వన్డేలో IND పేసర్ షమీ ప్రపంచ రికార్డుపై గురిపెట్టారు. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీస్తే ODIలలో అత్యంత వేగంగా 200వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలుస్తారు. ప్రస్తుతం షమీ 100 మ్యాచ్లలో 195 వికెట్లు తీశారు. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్ టాప్లో ఉన్నారు. అతను 102 మ్యాచ్లలో 200W కూల్చారు. ఆ తర్వాత ముస్తాక్-PAK(104M), ట్రెంట్ బౌల్ట్-NZ(107M), బ్రెట్ లీ-AUS(112M), డొనాల్డ్-SA(117M) ఉన్నారు.
News February 5, 2025
ఉగాది నుంచి P4: సీఎం చంద్రబాబు
AP: పేదరిక నిర్మూలనకు ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఉగాది నుంచి P4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్షిప్) విధానాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికంగా టాప్లో ఉన్న 10% మంది 20% మంది పేదలకు చేయూతనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పారిశ్రామివేత్తలు, NRIలు, ఇతర ధనవంతులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు.
News February 5, 2025
ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు
✒ 1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒ 1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒ 1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒ 1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒ 1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒ 2008: వన్డేల్లో సచిన్ 16,000 పరుగులు పూర్తి చేశారు