News April 29, 2024

జీరో కరెంటు బిల్లే నా లక్ష్యం: మోదీ

image

దేశంలో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్స్ ఏర్పాటు చేసి కరెంటు బిల్లులు సున్నా చేయడమే తన లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ. ‘అందరి ఇళ్లకు కరెంటు బిల్లు సున్నా కావాలి. మిగులు విద్యుత్‌తో ఆదాయం రావాలి. ఈవీల హవా రానున్న నేపథ్యంలో విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించాలి. సోలార్ కనెక్షన్లు వస్తే ఈవీల ఛార్జింగ్ సులభమవుతుంది. పెట్రోల్, డీజిల్ కోసం నెలకు అయ్యే రూ.1000-2000 ఖర్చు కూడా ఉండదు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 27, 2024

సచిన్ టెండూల్కర్‌కు అరుదైన అవకాశం

image

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన అవకాశం లభించింది. ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్(MCC)లో గౌరవ సభ్యునిగా సచిన్‌కు చోటు దక్కింది. తమ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారని MCC ట్వీట్ చేసింది. క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించిన సచిన్‌ MCCలో భాగమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. టెండూల్కర్ MCGలో 5 టెస్టులు ఆడగా 58.69 స్ట్రైక్ రేట్‌తో 449 పరుగులు చేశారు.

News December 27, 2024

విమానంలోనే ప్రెస్‌మీట్.. ఇది మన్మోహన్ స్టైల్

image

సైలెంట్‌ ప్రైమ్ మినిస్టర్ అంటూ తనను ప్రస్తావించడాన్ని మన్మోహన్ సింగ్ ఖండించేవారు. తాను మిగతావారిలా మీడియాతో మాట్లాడేందుకు భయపడేవాడిని కాదని చెప్పేవారు. విదేశీ పర్యటనలు ముగించి వచ్చేటపుడు ఆయన విమానంలోనే ప్రెస్ మీట్ నిర్వహించేవారు. ఏ అంశాన్ని మీడియా లేవనెత్తినా అనర్గళంగా మాట్లాడేవారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన ప్రధానిగా 117 సార్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. విదేశాల్లోనూ ప్రెస్‌తో మాట్లాడేవారు.

News December 27, 2024

సుజుకీ మాజీ ఛైర్మన్ కన్నుమూత

image

సుజుకీని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ సంస్థ మాజీ ఛైర్మన్ ఓసాము సుజుకీ(94) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈనెల 25న మరణించారు. జపాన్‌లో 1930లో జన్మించిన ఓసాము 1958లో సుజుకీలో చేరారు. తక్కువ కాలంలోనే సంస్థకు గుర్తింపు తీసుకొచ్చారు. దాదాపు 21 ఏళ్ల పాటు సంస్థ ఛైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం భారత్‌లో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది.