News September 25, 2024
రూ.లక్ష కోట్ల ప్రాఫిట్లో జెరోదా ట్రేడర్లు

FY24లో జెరోదా 62% వృద్ధితో రూ.4700 కోట్ల ప్రాఫిట్ ఆర్జించినట్టు ఫౌండర్ నితిన్ కామత్ తెలిపారు. రెవెన్యూ 21% వృద్ధితో రూ.8320 కోట్లుగా ఉందన్నారు. ‘జెరోదా ట్రేడర్లు ప్రస్తుతం రూ.లక్ష కోట్ల అన్రియలైజ్డ్ ప్రాఫిట్తో ఉన్నారు. మా కస్టడీలోని అసెట్స్ విలువ రూ.5.66 లక్షల కోట్లు. ఇండెక్స్ డెరివేటివ్స్ ద్వారా మాకు ఎక్కువ రెవెన్యూ వస్తోంది. రూల్స్లో మార్పు జరిగితే అందులో 30-50% కోత పడొచ్చు’ అని చెప్పారు.
Similar News
News November 12, 2025
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఉద్యోగాలు

ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<
News November 12, 2025
టమాటాలో శిలీంద్రం ఎండు తెగులును ఎలా నివారించాలి?

శిలీంద్రం ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పొలం నుంచి పీకి దూరంగా కాల్చేయాలి. పంటకు సరిపడినంత నీటి తడులు అందించాలి. ఎక్కువగా నీరు పెట్టకూడదు. తెగులు సోకిన మొక్కలను తొలగించిన నేలను.. లీటరు నీటికి మాంకోజెబ్ 3గ్రాములు కలిపి బాగా తడపాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మొక్కల వద్ద కూడా ఈ ద్రావణంతో నేలను బాగా తడపాలి. ట్రైకోడెర్మావిరిడేని వేపపిండి, పశువుల ఎరువుతో కలిపి నాటేముందు పొలంలో చల్లుకోవాలి.
News November 12, 2025
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరుతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పెద్దలను కూడా సీఎం కలుస్తారని సమాచారం.


