News October 10, 2025

ZHB: తేనెటీగల పెంపకం రైతులకు వరం

image

తేనెటీగల పెంపకం రైతులకు అదనపు ఆదాయం అందించే వరమని జిల్లా ఉద్యానవన అధికారి సీ.హెచ్. పండరి పేర్కొన్నారు. జహీరాబాద్‌లో కేవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ పెంపకం వల్ల పంట దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. ఎపిస్మెల్లా ఫెరా, ఎపిశెరా వంటి రకాలు పెంపకానికి అనువని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధ్యమని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.

Similar News

News October 10, 2025

అన్నమయ్య జిల్లాలో చెల్లిని గర్భవతిని చేశాడు..!

image

అన్నమయ్య జిల్లా KVపల్లె మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలిక(16) తల్లి కువైట్ వెళ్లింది. తండ్రికి పక్షవాతం కావడంతో మంచానపడ్డారు. ఈక్రమంలో బాలికపై ఆమె పెద్దనాన్న కుమారుడు కన్నేశాడు. ఆమెపై అఘాయిత్యం చేయడంతో గర్భం దాల్చింది. బుధవారం రాత్రి పీలేరులోని ఓ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న యువకుడు గ్రామం నుంచి పారిపోయాడు. బిడ్డను ఎవరికైనా ఇచ్చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

News October 10, 2025

వనపర్తి: జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

image

వనపర్తి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కానాయిపల్లిలో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెబ్బేర్ 25.5, విలియం కొండ 2.5, ఆత్మకూరు 18.5, రేవల్లి 12.3, జానంపేట 11.8, వెలుగొండ 11.5, మదనపురం 8.8, ఏదుల 7.3, అమరచింత 6.0, కేతేపల్లి 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 10, 2025

HYD: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు గంజాయి మత్తులో బాలిక సోదరుడి ముందే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అనారోగ్యానికి గురి అవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి తల్లి సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.