News December 6, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘జిగ్రా’ మూవీ

image

వాసన్ బాల డైరెక్షన్‌లో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జిగ్రా’ ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఓ అక్రమ కేసులో తమ్ముడు జైలుకు వెళ్లకుండా కాపాడుకునే పాత్రలో ఆలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Similar News

News March 23, 2026

సంగారెడ్డి: డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ: మంత్రి

image

ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం తెలిపారు. రెండు సంవత్సరాల్లో 10 వేల పోస్టులు భర్తీ చేశామని, మరో 7,000 పోస్టుల భర్తీ చివరి దశలో ఉందని చెప్పారు. మెడికల్ కళాశాలలో 1200 టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసినట్లు తెలిపారు. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

News March 23, 2026

దృశ్యం-3 రిలీజ్ వాయిదా

image

మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దృశ్యం-3 సినిమా విడుదల వాయిదా పడింది. తన పుట్టిన రోజైన మే 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మోహన్‌లాల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 1, 2 చిత్రాలు సూపర్ హిట్ కాగా, వాటికి కొనసాగింపుగా మూడో భాగం వస్తోంది.

News March 23, 2026

ఎన్నికల సంఘం లెటర్‌పై బీజేపీ ముద్ర.. కేరళంలో వివాదం!

image

ఎన్నికల సంఘం లెటర్‌పై BJP సీల్ ఉండటం కేరళంలో వివాదానికి దారి తీసింది. తీవ్ర దుమారం రేగడంతో రాష్ట్ర CEO కేల్కర్ స్పందించారు. ‘ఎన్నికల మార్గదర్శకాలపై 2019 మార్చి 19న EC పంపిన లేఖపై వివరణ కోరుతూ ఇటీవల BJP కేరళం విభాగం CEO ఆఫీసుకు వచ్చింది. అప్పుడు ఇచ్చిన దరఖాస్తుతోపాటు EC లేఖపై పార్టీ సీల్ ఉంది. క్లెరికల్ తప్పిదం వల్ల అది సర్క్యులేట్ అయింది. పొరపాటును గుర్తించి లేఖను ఉపసంహరించుకున్నాం’ అని తెలిపారు.