News January 1, 2025
మరణశిక్షను రద్దు చేసిన జింబాబ్వే

జింబాబ్వే మరణ శిక్షను రద్దు చేసింది. ఈ మేరకు బిల్లుపై అధ్యక్షుడు ఎమెర్సన్ నాన్గాగ్వా సంతకం చేశారు. ఇప్పటికే మరణశిక్ష పడిన 60మందికి దాన్ని అధికారులు జీవిత ఖైదుగా మార్చనున్నారు. 2005 నుంచి అక్కడ మరణ శిక్షల రద్దు గురించిన చర్చ నడుస్తోంది. వ్యతిరేకత ఉన్నప్పటికీ కోర్టులు మరణశిక్షను విధిస్తూ వచ్చాయి. తాజా చట్టంతో ఇక గరిష్ఠంగా జీవిత ఖైదు మాత్రమే విధించేందుకు వీలుంటుంది.
Similar News
News October 15, 2025
గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైనవారికి గుడ్న్యూస్

తెలంగాణలో గ్రూప్ -2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 18న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో 782 మందికి ఆయన అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తారు. ఇందుకుగానూ టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 28న టీజీపీఎస్సీ గ్రూప్-2 తుది ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
News October 15, 2025
APPLY NOW: చిత్తూరులో 56 పోస్టులు

AP: చిత్తూరులోని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్(DHMO) 56 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, ఎంబీబీఎస్, GNM, నర్సింగ్ డిగ్రీ, సీఏ, ఎంకామ్, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://chittoor.ap.gov.in/
News October 15, 2025
ఏపీ ఆరోగ్యానికి YCP హానికరం: లోకేశ్

మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తిచేసి పేద విద్యార్థులకు మేలు చేసేందుకే PPP విధానాన్ని తెచ్చామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘గతంలో పేద విద్యార్థులకు 42% సీట్లు ఇస్తే, PPP కళాశాలల్లో 50% సీట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పాం. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం లేదు. కేవలం పెట్టుబడిదారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. ఈ విషయంలో వైసీపీకి క్లారిటీ లేదు. రాష్ట్ర ఆరోగ్యానికి YCP హానికరం’ అని విమర్శించారు.