News January 17, 2025

Veg Mode Fee వసూలుపై జొమాటో CEO క్షమాపణలు

image

కొత్తగా తెచ్చిన ‘వెజ్ మోడ్ ఎనేబుల్‌మెంట్ ఫీ’పై విమర్శలతో జొమాటో వెనక్కి తగ్గింది. తాను వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసినందుకు అదనంగా ₹2 ఛార్జ్ చేయడంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘దేశంలో శాకాహారిగా ఉండటం ఖర్చుతో కూడుకున్నది’ అని జొమాటో CEOను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఇది వైరల్ కాగా స్పందించిన CEO దీపిందర్, తప్పుకు క్షమాపణ కోరడంతో పాటు ఈ స్టుపిడ్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తానన్నారు.

Similar News

News November 22, 2025

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులు

image

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్‌సైట్: cdri.res.in

News November 22, 2025

నిటారుగా ఉండే కొండ దారి ‘అళుదా మేడు’

image

అయ్యప్ప స్వాములు అళుదా నదిలో స్నానమాచరించిన తర్వాత ఓ నిటారైన కొండ ఎక్కుతారు. ఇది సుమారు 5KM ఉంటుంది. ఎత్తైన గుండ్రాళ్లతో కూడిన ఈ దారి యాత్రికులకు కఠినమైన పరీక్ష పెడుతుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉండదు. స్వామివారి నామస్మరణతో మాత్రమే ఈ నిట్టనిలువు దారిని అధిగమించగలరని నమ్ముతారు. ఈ మార్గాన్ని దాటితేనే యాత్రలో ముఖ్యమైన ఘట్టం పూర్తవుతుందట. <<-se>>#AyyappaMala<<>>

News November 22, 2025

వరికి మానిపండు తెగులు ముప్పు

image

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.