News January 20, 2025
Blinkit వల్ల Zomato షేర్లు క్రాష్.. ఎందుకంటే!

Q3 ఫలితాలు నిరాశపరచడంతో జొమాటో షేర్లు నేడు విలవిల్లాడాయి. ఇంట్రాడేలో ఏకంగా 7% మేర క్రాష్ అయ్యాయి. బ్లింకిట్ స్టోర్ల పెంపుకోసం అధికంగా ఖర్చు చేయడంతో నెట్ ప్రాఫిట్ 66% తగ్గి ₹176CR నుంచి ₹59CRగా నమోదైంది. ఇక రెవెన్యూ ₹4799CR నుంచి ₹5405CRకు చేరుకుంది. ఉదయం ₹251వద్ద మొదలైన షేర్లు ₹254 వద్ద గరిష్ఠాన్ని చేరాయి. ఫలితాలు రాగానే ₹228 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. చివరికి రూ.239 వద్ద క్లోజయ్యాయి.
Similar News
News December 14, 2025
దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే: ఖర్గే

ఓట్ చోరీకి పాల్పడే వారు ద్రోహులని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైరయ్యారు. ఓటు హక్కు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే BJPని అధికారం నుంచి దింపేయాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ భావజాలాన్ని బలోపేతం చేయడం భారతీయుల బాధ్యత. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. RSS ఐడియాలజీ దేశాన్ని నాశనం చేస్తుంది’ అని ఆరోపించారు. తన కొడుక్కు ఆపరేషన్ ఉన్నా వెళ్లలేదని, 140 కోట్ల మందిని కాపాడటమే ముఖ్యమని ర్యాలీకి వచ్చానని తెలిపారు.
News December 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 96 సమాధానం

ఈరోజు ప్రశ్న: సూర్యుడి వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి, సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్లిపోయింది ఎవరు?
సమాధానం: సూర్య భగవానుడి భార్య అయిన సంజ్ఞా దేవి తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి అడవులకు వెళ్లిపోయింది. సూర్యుని ద్వారా సంజ్ఞా దేవికి యముడు, యమున జన్మించారు. ఛాయాదేవికి శని, సావర్ణి, తపతి జన్మించారు. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 14, 2025
ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.


