News July 15, 2024
20% ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన జొమాటో& స్విగ్గీ!

ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో & స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్లాట్‌ఫామ్ ఫీజులను 20% పెంచేశాయి. ఈ నిర్ణయంతో కస్టమర్ ప్రతి ఆర్డర్‌పై రూ.1 అదనంగా చెల్లించాలి. దేశంలోని చాలా నగరాల్లో రూ.5 ఫీజు వసూలు చేస్తుండగా.. ఇది రూ.6కి పెరిగింది. రోజుకు 10 లక్షల కంటే ఎక్కువ బుకింగ్స్ జరుగుతుండగా ఈ ఫీజు ద్వారా కంపెనీలు రూ.60 లక్షలు పొందుతున్నాయి.
Similar News
News February 26, 2026
మార్చి 1 నుంచి సెస్ వసూలు.. పెరగనున్న వాహనాల ధరలు

TG: మార్చి 1 నుంచి నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నట్లు రవాణాశాఖ GO జారీ చేసింది. బైకులకు రూ.2వేలు, ఫోర్ వీలర్లకు రూ.5వేలు, ఇతర వాహనాలకు రూ.10వేలు సెస్‌గా నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ సమయంలో దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో TG ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం సమకూరనుంది. రూల్స్ ప్రకారం ఈ నిధులను రోడ్డు ప్రమాదాల నివారణకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
News February 26, 2026
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్/రీడర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. థియోరిటికల్ హై ఎనర్జీ ఫిజిక్స్, థియోరిటికల్ కండెన్స్ మ్యాటర్ ఫిజిక్స్, ఎక్సపర్మెంటల్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. రీడర్‌కు 38ఏళ్లు. వెబ్‌సైట్: https://www.iopb.res.in
News February 26, 2026
గొర్రె పిల్లలకు వివిధ దశల్లో ఇవ్వాల్సిన ఆహారం

గొర్రె పిల్లల పెరుగుదలకు అందించాల్సిన ఆహారంపై వెటర్నరీ నిపుణుల సూచనలు
☛ పిల్ల పుట్టిన మొదటి 3 రోజుల వరకు: తల్లితో పాటు పిల్లను ఉంచి.. పిల్ల శరీర బరువులో 20 శాతం జున్నుపాలను ప్రతి రోజూ అందించాలి.
☛ తొలి 2 వారాల వరకు: పిల్లలను పూర్తిగా తల్లిపాల మీదనే ఉంచాలి. పుట్టిన పిల్ల శరీర బరువు 3 కిలోలు ఉంటే రోజుకి 600ml పాలు అందించాలి. తల్లి వద్ద సరిపడినన్ని పాలు లేకపోతే ఆవు లేదా గేదె పాలను అదనంగా అందించాలి.


