News July 14, 2024
ఫుడ్ డెలివరీ చేయని జొమాటో.. మహిళకు రూ.60వేల పరిహారం

మొమోస్ ఆర్డర్ చేసిన మహిళకు వాటిని అందించకుండా డబ్బు తీసుకున్న జొమాటోకు కర్ణాటక వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. మొత్తం రూ.60వేల పరిహారాన్ని ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. గత ఏడాది ఆగస్టు 31న శీతల్ అనే మహిళ జొమాటోలో మొమోస్ ఆర్డర్ చేసి రూ.133 చెల్లించారు. అయితే ఫుడ్ డెలివరీ కాకుండానే అయినట్లు ఆమెకు మెసేజ్ వచ్చింది. దీనిపై కంప్లైంట్ ఇచ్చినా సంస్థ పట్టించుకోలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు.
Similar News
News October 29, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<
News October 29, 2025
ఇంటి చిట్కాలు

* ఓవెన్‌ని క్లీన్ చేయడానికి ఒక బౌల్లో నిమ్మ ముక్కల్ని వేసి ఓవెన్లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఒక తడి క్లాత్‌తో ఓవెన్‌ని తుడిస్తే సరిపోతుంది.
* గ్లాస్ ఓవెన్ డోర్‌పై బేకింగ్ సోడా-నీళ్లు కలిపి రాసి పొడి క్లాత్‌తో తుడిస్తే మరకలు వదిలిపోతాయి.
* కిచెన్ సింక్, వాష్‌బేసిన్లపై పడే మరకలపై టూత్‌పేస్ట్ పూసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆపై స్పాంజ్‌తో రుద్ది కడిగేస్తే మరకలు సులభంగా వదిలిపోతాయి.
News October 29, 2025
60 మంది డ్రగ్ పెడ్లర్ల కాల్చివేత

2,500మంది బ్రెజిల్ పోలీసులు, జవాన్లు రియోలో డ్రగ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌పై సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. 60మంది అనుమానితులను కాల్చివేశారు. 81 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు పోలీసులూ చనిపోయారు. 93 రైఫిల్స్, 500కిలోల డ్రగ్స్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, ఆర్మ్డ్ వెహికల్స్ ఉపయోగించారు. ఈ దాడిని UN హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఖండించింది. విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.


