News February 6, 2025

జొమాటో పేరు మారింది..

image

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పేరు మార్చుకుంది. ఇక నుంచి ‘జొమాటో లిమిటెడ్’కు బదులు ‘Eternal Limited’ పేరు కొనసాగుతుందని ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని, షేర్ హోల్డర్లు ఈ పేరును ఆమోదించాల్సి ఉందని పేర్కొంది.

Similar News

News April 2, 2026

మరోసారి తగ్గిన గోల్డ్ రేటు

image

పెట్టుబడిదారులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. ట్రంప్ ప్రకటనతో డాలర్‌పై ఒత్తిడి, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల బంగారం ధరలు ఇవాళ <<19544455>>మరోసారి<<>> పడిపోయాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.3,980 తగ్గి రూ.1,48,970కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 పతనమై రూ.1,36,550 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది. తగ్గుతున్న ధరలు కొనుగోలుదారులకు ఊరటనివ్వనున్నాయి.

News April 2, 2026

చట్టబద్ధతతో శాశ్వత రాజధానిపై స్పష్టత: రామ్మోహన్

image

విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో చర్చ సందర్భంగా అన్నారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధతతో ప్రజలకు స్పష్టత ఇస్తున్నామని తెలిపారు. 2014లోనే అమరావతిపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని గుర్తుచేశారు. కానీ 2019-24 మధ్య YCP ప్రభుత్వం 3 రాజధానుల నాటకమాడిందని మండిపడ్డారు. రాజధాని కోసం ఉద్యమించిన రైతులను హింసించిందని ఆరోపించారు.

News April 2, 2026

వరుసగా 3 రోజులు సెలవులు

image

వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు శని, ఆదివారాలు హాలిడేస్ ఉంటాయి. ఇక రేపు గుడ్ ఫ్రైడ్ సందర్భంగా పబ్లిక్/ఆప్షనల్ హాలిడే ఉంది. దీంతో రేపట్నుంచి 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. లాంగ్ వీకెండ్ రావడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లు, హాలిడే స్పాట్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.