News July 15, 2024
జువాలజిస్ట్కు 249ఏళ్ల జైలు శిక్ష!

ఆస్ట్రేలియాలో 60కిపైగా కుక్కలను రేప్ చేసి, చంపినందుకు జువాలజిస్ట్ ఆడమ్ బ్రిటన్‌కు కోర్టు ఏకంగా 249ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు కుక్కలను కొట్టి చంపి, తన క్రూరత్వాన్ని వీడియోలో తీసేవాడట. కుక్కలను హింసించేందుకు అతడు షిప్పింగ్ కంటైనర్‌ను టార్చర్ రూమ్‌లా ఉపయోగించేవాడట. అతడి లాయర్ కొత్త నివేదిక కోర్టుకు ఇవ్వడంతో ఈ కేసును ఆగస్టులో విచారించనుంది.
Similar News
News November 16, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్
News November 16, 2025
పాకిస్థాన్ నుంచి డ్రోన్లతో బాంబులు, డ్రగ్స్ సరఫరా

పాక్ నుంచి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చైన్‌ను NIA రట్టు చేసింది. ప్రధాన వ్యక్తి విశాల్ ప్రచార్ అరెస్టు చేసి తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. పాక్ బార్డర్లలో డ్రోన్ల ద్వారా వచ్చే ఆర్మ్స్, డ్రగ్స్, అమ్మోనియం వంటి వాటిని గ్యాంగుల ద్వారా పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌కు చేరవేస్తున్నారని పేర్కొంది. సామాజిక అస్థిరత సృష్టించేలా ఈ గ్యాంగులు పనిచేస్తున్నాయని NIA వివరించింది.
News November 16, 2025
STRANGE: ఈ ఊరిలో 450 మంది ట్విన్స్

ఒక ఊరిలో పది మంది కవలలు ఉంటేనే ఆశ్చర్యంగా చూస్తుంటారు. అలాంటిది 2వేల మంది జనాభా ఉన్న కేరళలోని ‘కొడిన్హి’లో ఏకంగా 450 జతల కవలలు ఉంటే ఇంకెలా ఉంటుంది. అక్కడ కవల పిల్లలు ఎక్కువగా పుట్టడం అంతుచిక్కని విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, జన్యు శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిర్దిష్టమైన కారణాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే వలస వచ్చిన కుటుంబాలకూ కవలలు జన్మించడం విచిత్రం.


