News August 10, 2025
ZPTC ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్టలో ZPTC ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం కడపలో వారు మాట్లాడారు. క్రిటికల్ స్టేషన్లలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేశామన్నారు. 13 చెక్‌పోస్టులు, డ్రోన్లు, వజ్రా వెహికల్స్‌తో భద్రత కల్పించామన్నారు. హింసాత్మక చర్యలపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
Similar News
News August 13, 2025
కడప జైలు అధికారులపై విచారణకు ఆదేశాలు

కడప సెంట్రల్ జైలు పూర్వ అధికారులు ప్రకాష్, జవహర్ బాబు, డాక్టర్ పుష్పలతలపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ క్యాంపుల పేరుతో ఖైదీలను బెదిరించిన ఘటనలకు బాధ్యులైన వారిపై విచారణ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. కర్నూల్ SP విక్రాంత్ పాటిల్, కడప DMHO డాక్టర్ నాగరాజు, జైళ్లశాఖ అధికారి ఇర్ఫాన్, RDO ఇర్విన్ విచారణాధికారులుగా వ్యవహరించనున్నారు.
News August 12, 2025
కడప: కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. పులివెందులలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనికి అనుసంధానం చేసి సీసీ కెమెరాల ఫుటేజీని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. తుమ్మలపల్లి, నల్లపురెడ్డిపల్లి, కొత్త మాధవరం, ఒంటిమిట్ట ప్రాంతాల పోలింగ్ సరళిని ఇక్కడినే వీక్షించి పోలీసులకు పలు సూచనలు చేశారు.
News August 12, 2025
ఒంటిమిట్టలో 60 శాతం దాటిన పోలింగ్

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటలకు పులివెందులలో 71.36శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 7,565 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో 66.39శాతం ఓటింగ్ జరగ్గా.. 24, 606 ఓట్లకు 16,336 ఓట్లు పోలయ్యాయి. 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.