News December 25, 2024
అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్ డబ్ల్యూఎస్, ఐసిడిఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్మాణ పనులన్నీ తప్పనిసరిగా నాణ్యతతో ఉండాలన్నారు. పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షించి, ధృవీకరించాలన్నారు.
Similar News
News December 26, 2024
ప.గో విషాదం నింపిన విహార యాత్ర
విహార యాత్ర విషాదాన్ని నింపింది. ద్వారకాతిరుమల (M) ఎం.నాగులపల్లి వద్ద ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘంటశాలకు చెందిన భాను ప్రకాశ్, గౌతమ్, వెంకట సాయి, చల్లపల్లికి చెందిన భార్గవ్, తేజలు విజయవాడ నుంచి కారు అద్దెకు తీసుకుని మారేడుమిల్లి విహార యాత్రకు బయలు దేరారు. నాగులపల్లి వద్ద బుధవారం వేకువ జామున ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న గౌతమ్ మృతి చెందాడు.
News December 26, 2024
ఉండి: భార్యల సహకారంతో డెడ్‌బాడీ పార్శిల్..?
ఉండి మండలంలో తులసిని బెదిరించడానికి శ్రీధర్ వర్మ పర్లయ్యను చంపి పార్శిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీధర్ భార్యలు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆయన రెండో భార్య అయిన తులసి చెల్లెలు రేవతి కూడా పార్శిల్ పంపడానికి సహకారం అందించినట్లు తెలుస్తోంది. దీని కోసం ఆమె తన నగలు అమ్మేసి డబ్బులు సమకూర్చింది. మూడో భార్య సుష్మ డెడ్‌బాడీని ఆటో డ్రైవర్‌కు ఇవ్వగా ఆయన డోర్ డెలివరీ చేశాడు.
News December 26, 2024
ఏలూరు: 28 నుంచి శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు
ఏలూరు ఆర్‌ఆర్‌పేట శ్రీవేంకటేశ్వర స్వామి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. బుధవారం బ్రహ్మోత్సవాల కరపత్రాలను అర్చకులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే జనవరి 18వ తేదీ వరకు శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.