News October 27, 2024
అంజన్ కుమార్‌ను గెలిపిస్తే మంత్రి అయ్యేవారు: CM
ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న తెలంగాణ సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపిస్తే మంత్రి అయ్యేవారని పేర్కొన్నారు. అయినప్పటికీ యాదవ సోదరులు రాజకీయాల్లో రాణించాలి, వారికి ఒక అండ కావాలన్న మంచి ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Similar News
News January 21, 2025
రంగారెడ్డి: ప్రజావాణికి 87 ఫిర్యాదులు
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2025
HYD: AIR PORT రన్ వే కింద నుంచి ఎలివేటెడ్ కారిడార్!
ఎయిర్‌పోర్ట్ అథారిటీ పరిమితుల కారణంగా HMDA డబుల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయ రన్ వే కింద నుంచి అండర్ గ్రౌండ్‌లో తాడ్ బండ్, బోయిన్‌పల్లి మధ్యలో దాదాపు 600 మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ మెట్రో ఎండీ NVS రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి, మార్గాలను పరిశీలించారు.
News January 20, 2025
GHMC ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమం
ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను డిప్యూటీ మేయర్ ఆదేశించారు.