News January 24, 2025
అంతర్గాం: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
అంతర్గాం మండలం ముర్ముర్ గ్రామంలో నిన్న పెసరి సత్తమ్మ కిరాణ షాపు వద్ద ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మెడలో ఉన్న 3 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న SI వెంకటస్వామి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈరోజు ఇద్దరు నిందితులను ఎల్లంపల్లి డ్యాం వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
Similar News
News January 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. పిల్లలు ఏం చెప్పారంటే?
TG: మీర్‌పేట్‌కు చెందిన మాధవి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మాధవి ఇద్దరు పిల్లల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. తమ తల్లి కనిపించకుండా పోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని చెప్పారు. మరోవైపు నిందితుడు చెప్పిన విషయాలపైనే కాకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
News January 24, 2025
TG ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోంది: కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ‘ఒప్పందాలు పేపర్‌కే పరిమితం కావొద్దు. రాష్ట్రానికి చెందిన వారిని దావోస్‌కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి? పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
News January 24, 2025
న్యూయార్క్‌లో 5 రోజులుగా గన్ కాల్పుల్లేవ్..!
న్యూయార్క్‌లో గత ఐదు రోజులుగా ఒక్క చోట కూడా కాల్పులు చోటుచేసుకోలేదని సిటీ పోలీసులు తెలిపారు. ఇలా 5 రోజులపాటు కాల్పులు జరగకపోవడం 30 ఏళ్లలో ఇదే తొలిసారని వెల్లడించారు. అలాగే 2024 డిసెంబర్‌లో తుపాకీ కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తెలిపారు. అదే 2023 డిసెంబర్‌లో 9 మంది తూటాలకు బలైనట్లు పేర్కొన్నారు. కాగా కొన్ని దశాబ్దాలుగా న్యూయార్క్‌లో నిత్యం ఏదోకచోట కాల్పులు జరగడం పరిపాటిగా మారింది.