News February 22, 2025

అంద‌రికీ రుణ‌మాఫీ.. అదో అంద‌మైన క‌ట్టుక‌థ: హ‌రీశ్‌రావు

image

సీఎం రేవంత్‌పై హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇప్ప‌టికీ చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కాలేద‌ని, రైతుల నుంచి తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మవుతున్నాయ‌ని ఆయన అన్నారు. గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద ధ‌ర్నాకు దిగిన రైతు విష‌యంలో హ‌రీశ్‌రావు స్పందించారు. అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టు కథను ప్రచారం చేస్తున్న మిమ్మల్ని నిలదీసేందుకు గాంధీభవన్ దాకా వచ్చిన రైతుకు ఏం సమాధానం చెబుతారు అని హ‌రీశ్ నిల‌దీశారు.

Similar News

News December 14, 2025

మెదక్: మధ్యాహ్నం ఒంటిగంట వరకు 85% పోలింగ్

image

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు 85% నమోదైంది. ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు స్వగ్రామం కొర్విపల్లి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కోనాపూర్‌లో ఓటేశారు. పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు సందర్శించారు.

News December 14, 2025

మెదక్: పోలింగ్ ముగిసింది.. ఫలితం కోసం ఎదురుచూపు

image

మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత పక్షం రోజులుగా అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చేయ ప్రయత్నం లేదు. ఈసారి ఎన్నికల్లో డబ్బు, మద్యం, బాండ్ పేపర్ హామీలు కీలకంగా మారాయి. కొన్ని పంచాయతీలలో అభ్యర్థులు లక్షల రూపాయలు నీళ్లలా ఖర్చు చేశారు. మరి కొన్ని గంటల్లో ఫలితం తేలనుంది.

News December 14, 2025

MDK: సమస్యాత్మక పోలింగ్ బూత్ పరిశీలించిన ఎస్పీ

image

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌గా గుర్తించిన రాజ్‌పల్లి పోలింగ్ బూత్‌ను మెదక్ జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విధులు నిర్వహించాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్‌ఐ శైలందర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.