News March 26, 2024
అందరితో సంప్రదించాకే నిర్ణయం: ఎమ్మెల్సీ జంగా
అందరితో సంప్రదించిన తర్వాతే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు జంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురజాల నియోజకవర్గంలో అనిశ్చితి రాజకీయాన్ని ఆసరాగా చేసుకుని మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దల సలహాలను, సూచనలను తీసుకొని తుది నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.
Similar News
News November 17, 2024
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డిపై కేసు నమోదు
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి శ్రీరెడ్డిపై నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరనాయక్ చెప్పారు.
News November 17, 2024
ప్రభుత్వంలోని మంచి, చెడులను వెలికి తీయాలి: మంత్రి
మంగళగిరి: జర్నలిస్టులు ప్రభుత్వంలో జరుగుతున్న మంచి, చెడులను విచక్షణారహితంగా వెలుగులోకి తీసుకురావాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ రచయిత ఈపురి రాజారత్నం రచించిన ‘జర్నలిజం జర్నలిస్టుల బేసిక్స్’ పుస్తకాన్ని ఆయన శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు. పలువురు జర్నలిస్టులు మస్తాన్ రావు, బత్తుల సాంబశివరావు, ఎస్‌కె రఫీ పాల్గొన్నారు.
News November 16, 2024
గుంటూరు: జాతీయ రహదారిపై మూడు లారీలు ఢీ.. ఇద్దరు మృతి
గుంటూరు నగర శివారు నల్లపాడు స్టేషన్ పరిధిలోని బుడంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై మూడు లారీలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. మరమ్మతులకు గురైన కార్ల కంటైనర్‌ను ప్లేవుడ్ లోడ్‌తో వెళ్తున్న లారీ, ప్లేవుడ్ లోడ్ లారీని ఐచర్ లారీ ఢీకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.