News April 10, 2025
అందాల పోటీల ఏర్పాట్లను పరిశీలించిన స్మిత సబర్వాల్

తెలంగాణ పర్యాటక కార్యదర్శి స్మిత సబర్వాల్ HYDలోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శించి, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఈ కార్యక్రమం హైలైట్ చేసేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. మరో నెలలో మిస్ వరల్డ్- 2025 72వ ఎడిషన్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది.
Similar News
News April 19, 2025
RCBకి చిన్నస్వామి స్టేడియమే శాపమా?

18 ఏళ్లుగా IPL టైటిల్ కొట్టాలనే RCB కలలపై సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం నీళ్లు చల్లుతోంది. బయటి మైదానాల్లో గెలుస్తున్న RCB ఇక్కడ మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ స్టేడియం చిన్నగా ఉండటం సొంత జట్టుకన్నా ప్రత్యర్థులకే ఎక్కువగా ఉపయోగపడుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత WPL, IPLలో కలిపి ఇక్కడ 7 మ్యాచులు వరుసగా ఓడడంతో ఈ మైదానం RCBకి అచ్చిరావడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.
News April 19, 2025
కడపలో పోలీసుల శ్రమదానం

నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే పోలీసులు చీపుర చేతబట్టి చెత్త ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
News April 19, 2025
మన ఓరుగల్లు జిల్లా.. ఎన్నో ప్రత్యేకతలు

మన ఓరుగల్లు పేరు చెప్పగానే కాకతీయులు గుర్తుకొస్తూ ఉంటారు. ఓరుగల్లును రాజధానిగా చేసుకొని కాకతీయులు తమ పరిపాలనను కొనసాగించారు. తమ కాలంలో వారు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు చెరువులు, వారు నిర్మించిన రామప్ప, వేయి స్తంభాల ఆలయం, కోట, కాకతీయ కళా తోరణం, కోటగుళ్లు, ఇతర శివాలయాలు నేటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.