News April 5, 2025
అంబాజీపేట: అన్న కర్మకాండ రోజునే తమ్ముళ్లు మృతి

అంబాజీపేట మండలం గంగలకుర్రులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గత నెల 24న సూర్యనారాయణమూర్తి మృతి చెందగా అతని సోదరులు నాగరాజు, రామచంద్రరావు దిన కార్యం నిర్వహించారు. గోదావరిలో నదికి స్నానానికి బైకుపై వెళ్తుండగా వారిని టిప్పర్ ఢీకొట్టింది. అన్న దినకార్యం రోజునే ఇద్దరు సోదరులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
Similar News
News April 6, 2025
గుజరాత్‌తో సన్‌రైజర్స్ ఢీ.. గెలుపెవరిదో!

IPLలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు గుజరాత్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న SRH సొంత గ్రౌండ్‌లో మళ్లీ గాడిన పడాలని చూస్తోండగా వరుస విజయాల జోరును కొనసాగించాలని GT భావిస్తోంది. SRH టీమ్ బ్యాటింగ్‌లో క్లిక్ అవ్వకపోగా బౌలింగ్‌లో వికెట్లూ తీయలేకపోతోంది. ఫీల్డింగ్‌లోనూ పేలవంగానే కనిపిస్తోంది. మరోవైపు GT బలంగా ఉంది. మరి ఈరోజు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
News April 6, 2025
ట్రోలింగ్ వల్ల వారికి ఏం ఆనందం వస్తుందో: మోహన్ బాబు

ట్రోలింగ్‌ను తాను పట్టించుకోనని నటుడు మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎదుటివాళ్లు నాశనమవ్వాలని కోరుకోకూడదు. అలా కోరుకుంటే వాళ్లకంటే ముందు మనమే నాశనమవుతాం. అందరూ క్షేమంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఈ ట్రోలింగ్ చేసేవారికి దాని వల్ల ఏం ఆనందం వస్తుందో అర్థంకాదు. అయితే ఎవర్నీ నిందించను. దేవుడి ఆశీస్సులతో ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ పిల్లలతో హాయిగా ఉండాలనుకుంటున్నాను అంతే’ అని తెలిపారు.
News April 6, 2025
మావోయిస్టులు లొంగిపోవడానికి కారణం?

మావోయిస్టులు గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. వారి లొంగుబాట్లకు కారణాలేంటన్నదానిపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దళ సభ్యుల మధ్య విభేదాలు, సీనియర్లలో వయోభారం, నేటి కాలంలో సిద్ధాంతాలు ఇమడటం లేదన్న భావం, ప్రజల మద్దతు లభించకపోవడం, బలగాల దాడుల తీవ్రత పెరగడం.. ఇలాంటివన్నీ కలగలిసి మావోయిస్టులు లొంగిపోయేందుకు మొగ్గుచూపిస్తున్నారన్న వాదనలున్నాయి. మీరేమనుకుంటున్నారు?