News April 4, 2025

అంబాజీపేట: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త సూసైడ్ 

image

అంబాజీపేట లీజర్ కాలనీకి చెందిన రొక్కాల మోజెస్ (34) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ చిరంజీవి గురువారం తెలిపారు. భార్యభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధలే సూసైడ్‌కు కారణమని ఎస్సై పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలతో వారం రోజుల క్రితం భార్య అల్లవరం మండలం తుమ్మలపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. దీంతో జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నాడు.

Similar News

News April 5, 2025

SKLM: అలెర్ట్.. రైళ్ల గమ్య స్థానాల్లో మార్పులు

image

పలాస, శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే షాలిమార్- వాస్కోడగామా(VSG) అమరావతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల గమ్యస్థానంల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున ఈనెల 17- 28 వరకు నం.18047 SHM- VSG రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ వరకు వెళ్లనుంది. ఈ నెల 20 నుంచి మే 1 వరకు నెం.18048 VSG- SHM రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ నుంచి నడుస్తాయన్నారు.

News April 5, 2025

NTR లుక్‌పై అభిమానుల ఆందోళన!

image

యంగ్ టైగర్ NTR కొత్త లుక్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘NTR-NEEL’ సినిమా కోసం ఆయన ఒక్కసారిగా బరువు తగ్గారు. ఎన్టీఆర్ అంటే కాస్త చబ్బీగా కండలు తిరిగిన బాడీతో ఉండాలని, ఇంత స్లిమ్‌ అవ్వడం ఏంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సూట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరేమో స్లిమ్‌గా అదిరిపోయారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ లుక్ మీకెలా అనిపించింది? COMMENT

News April 5, 2025

బొండపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్.. ఏడుగురి అరెస్ట్

image

మండల కేంద్రమైన బొండపల్లిలో ఆన్‌లైన్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై యు.మహేశ్ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!