News April 14, 2025
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: ఎర్రబెల్లి

దేవరుప్పుల మండల కేంద్రంలో నూతన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. డాక్టర్ అంబేడ్కర్ వల్లే భారత రాజ్యాంగం సాధ్యమైందన్నారు. వారి ఆశయాలను కొనసాగించేలా చూడాలన్నారు. కొందరు దేశ రాజకీయ నేతలు అంబేడ్కర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలున్నారు.
Similar News
News April 18, 2025
GHMC పరిధిలో నమోదైన వర్షపాతం..!

HYDలో భారీ వర్షం కురుస్తుంది. అత్యధికంగా రెయిన్‌బజార్ యాకుత్‌పురాలో 56.5 మి.మీ, డబీర్‌పుర బలశెట్టి వాటర్ ట్యాంక్ వద్ద 48.5 మిమీ, దూద్‌బౌలి 46.5 మిమీ వర్షం నమోదైంది. గన్‌ఫౌండరీ, రూపాల్ బజార్ 2 చోట్లా 41 మిమీ, నాంపల్లిలో 40.5 మిమీ, అజంపురాలో 38.5 మిమీ, కంచన్‌బాగ్‌లో 36.8 మిమీ, ఎడిబజార్‌లో 33.3 మిమీ, కుత్బుల్లాపూర్ ఆదర్శ్‌నగర్‌లో 31.5 మిమీ వర్షపాతం కురిసింది.
News April 18, 2025
అమెరికా వైమానిక దాడి.. యెమెన్‌లో 74 మంది మృతి

యెమెన్‌లోని ఆయిల్ పోర్టుపై US చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 74కు చేరింది. ఈ ఘటనలో 171 మంది గాయపడినట్లు హౌతీ గ్రూప్ వెల్లడించింది. నెలరోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇదే అత్యంత దారుణమైన దాడి అని తెలిపింది. కాగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై హౌతీల దాడులను ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. వారికి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో US ఆర్మీ హౌతీలపై విరుచుకుపడుతోంది.
News April 18, 2025
నటుడిపై ఫిర్యాదు వెనక్కి తీసుకుంటా: నటి

అసభ్యంగా ప్రవర్తించాడంటూ మలయాళ నటి విన్సీ అలోషియస్ ఓ నటుడిపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అది టామ్ చాకో అని బయటికి రావడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. ‘నేను అధికారుల్ని నమ్మాను. అతడి పేరు బయటికి రావొద్దని స్పష్టంగా చెప్పాను. అయినా పేరును లీక్ చేశారు. ప్రతిభావంతుడైన నటుడికి సినిమాల్లో అవకాశాలు ఆగకూడదు. తన తప్పును సరిదిద్దుకుంటాడన్నదే నా ఆశ’ అని పేర్కొన్నారు.