News April 24, 2025
అంబేడ్కర్ కోనసీమ: ఆలోచింప చేస్తున్న చిత్రం

చిన్నపిల్లలు, యువకులు, పెద్దలు అంతా సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారారు. తద్వారా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థి దశలో సెల్‌ఫోన్ వ్యసనంగా మారింది. టీచర్స్, పేరెంట్స్‌ను సైతం లెక్కచేయక తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. బుధవారం సెల్‌ఫోన్‌కు బానిసగా బారిన స్టూడెంట్ టీచర్‌పై చేయిచేసుకుంది. దీనిపై కాట్రేనికోనకు చెందిన చిత్రకారుడు అంజి ఆకొండి గీసిన చిత్రం ప్రజలను ఆలోచింపజేస్తోంది.
Similar News
News April 24, 2025
అర్జున్ టెండూల్కర్‌ను నా కొడుకు గేల్‌లా మారుస్తాడు: యోగ్‌రాజ్

అర్జున్ టెండూల్కర్‌ను తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు అప్పగిస్తే క్రిస్ గేల్‌లా తయారు చేస్తాడని ఆయన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘3 నెలలపాటు యువీ దగ్గర అర్జున్ శిక్షణ తీసుకోవాలి. బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించాలి. గిల్, అభిషేక్ శర్మలాగే అతడూ స్టార్‌గా ఎదుగుతాడు’ అని పేర్కొన్నారు. కాగా అర్జున్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
News April 24, 2025
పాకిస్థానీల వీసాలన్నీ రద్దు

ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రజలకు ఇచ్చిన వీసాలన్నింటినీ భారత విదేశాంగ శాఖ రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు ఈ APR 27 వరకు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేసింది. ఇక మెడికల్ వీసాలతో భారత్‌లో ఉన్నవారు ఏప్రిల్ 29 లోపు వెళ్లిపోవాలని పేర్కొంది. మరోవైపు భారతీయులెవరూ పాక్‌కు వెళ్లొద్దని చెప్పడంతో పాటు ఇప్పటికే ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వీలైనంత త్వరగా తిరిగి రావాలని సూచించింది.
News April 24, 2025
జిల్లాలో జూన్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ: కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జూన్ మొదటి వారం వరకు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో డీఆర్డీఏ ఐకేపీ ద్వారా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు.