News April 6, 2025

అంబేద్కర్ కోనసీమ: సోమవారం యథావిధిగా గ్రీవెన్స్ 

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక- గ్రీవెన్స్ కార్యక్రమం ఈ నెల 7న సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో జరుగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారించుకోవాలని ఆయన సూచించారు.  డివిజన్, మండల, మునిసిపల్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

Similar News

News April 17, 2025

KNR బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

image

KNR బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్, జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఎన్నికల వివరాలను తెలుసుకుని అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజును మంత్రి పొన్నం ప్రత్యేకంగా అభినందించారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.

News April 17, 2025

కరీంనగర్: నేటి నుంచి అవగాహన సదస్సులు

image

భూభారతి నూతన రెవేన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో నిర్వహించే సదస్సులకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసింది.

News April 17, 2025

ప్రపంచంలో మొట్టమొదటి స్పెర్మ్ రేస్.. ఎక్కడంటే?

image

లాస్ ఏంజెలిస్‌లో ప్రపంచంలోనే తొలిసారిగా స్పెర్మ్ రేస్ ఈ నెల 25న జరగబోతోంది. తగ్గుతున్న పురుషుల సంతానోత్పత్తి రేటుపై అవగాహన కల్పించేందుకు స్పెర్మ్ రేస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న కార్యక్రమం చేపడుతోంది. ఈ రేస్‌లో 1,000 మంది పాల్గొంటారు. వీర్యం నమూనాలను 20 సెం.మీ పొడవైన మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్‌పై ఉంచుతారు. ఏ నమూనా స్పెర్మ్ ముందుగా ఫినిష్ లైన్ చేరుకుంటుందో దానిని విజేతగా ప్రకటిస్తారు.

error: Content is protected !!