News April 12, 2025
అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి: కలెక్టర్

ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సభ గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు ఆవిష్కరించారు.
Similar News
News April 13, 2025
5MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన మంత్రి

కాటారం మండలం ధన్వాడ సబ్ స్టేషన్‌లో వేసవి కాలంలో పెరుగుతున్న లోడ్ కోసం, అదనపు 5MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.కోటితో అంచనా వేసి, ఆ ట్రాన్స్‌ఫార్మర్ పనులు ఇటీవల పూర్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల విద్యుత్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News April 13, 2025
రెంటచింతలలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత

రెంటచింతల పరిసర ప్రాంతాలలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీలుగా నమోదు అయినట్లు జంగమహేశ్వరంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచే రెంటచింతల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో ఎండ నిప్పుల కొలిమిని తలపించింది. గ్రామాలలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశం మేఘావృతం అయింది. సాయంత్రానికి 27.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News April 13, 2025
విశాఖ జూలో 27 జింకల జననం

విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలలో 27 జింకలు పుట్టినట్లు క్యూరేటర్ మంగమ్మ ఆదివారం తెలిపారు. జూ పార్క్‌లో జంతువుల సంతానోత్పత్తి, పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. వీటిలో ఒక మౌస్ డీర్, రెండు బార్కింగ్ డీర్, మూడు నీల్ ఘై, ఐదు సాంబార్ డీర్, ఏడు స్పాటెడ్ డీర్, తొమ్మిది బ్లాక్ బక్స్ ఉన్నాయన్నారు. జూ సందర్శకులు ఈ అందమైన జింకలను చూసేందుకు మరికొద్ది రోజుల్లో అవకాశం కల్పిస్తామన్నారు.