News February 12, 2025

అక్రమం ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ సీపీ

image

ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు సన్నద్ధమాయ్యారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ శివారులోని ఇసుక ర్యాంపులను పరిశీలించారు.

Similar News

News February 12, 2025

ములకలచెరువు: రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి

image

రోడ్డుప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె ప్రశాంతనగర్‌కు చెందిన భార్యాభర్తలు, పిల్లలు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తప్పు ఎవరిదైనా ప్రమాదంలో నాలుగు ప్రాణాలు పోవడం తీరని విషాదం. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. డ్రైవింగ్ చేసే ముందు మనకూ ఒక కుటుంబం ఉందని గుర్తించండి.

News February 12, 2025

ఈనెల 15న ఆటో డ్రైవర్ల రాష్ట్రవ్యాప్త ఆందోళన

image

TG: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు ఆటో డ్రైవర్స్ ఐకాస ప్రకటించింది. కార్మికులకు నెలకు రూ.12వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని ఐకాస కన్వీనర్ వెంకటేశం తెలిపారు. సమ్మెకు పిలుపునిస్తే మంత్రి పొన్నం ఇంటికి పిలిపించి మాట్లాడారని, కానీ 4 నెలలైనా పరిష్కారం చూపలేదని వాపోయారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రూ.10వేల Cr విడుదల చేయాలన్నారు.

News February 12, 2025

MBNR: ఇద్దరు ఎస్‌ఐల బదిలీ: డీఐజీ

image

జోగులాంబ గద్వాల జోన్-7 పరిధిలో ఇద్దరు ఎస్‌ఐలను బదిలీ చేసినట్టు డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ తెలిపారు. రాజాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కేతావత్ రవిని మహబూబ్ నగర్ వీఆర్‌కు బదిలీ చేయగా, జడ్చర్ల PS ఎస్సై శివానందంను రాజాపూర్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు. ఈమేరకు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

error: Content is protected !!