News March 13, 2025
అచ్చంపేట డిపోకు 10 మహిళా శక్తి బస్సులు కేటాయింపు

మహిళలను ఆర్థికంగా ఎదిగించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో బస్సులను కేటాయించింది. నల్లమల ప్రాంతం నియోజకవర్గంలో అధికంగా మారుమూల పల్లెలు, గిరిజన తండాలు ఉండడంతో అచ్చంపేట డిపోకు 10 బస్సులు కేటాయించినట్లు డిపో మేనేజర్ మురళీ దుర్గాప్రసాద్ తెలిపారు. వీటి నిర్వహణ త్వరలో మహిళా సంఘాలు నిర్వహించనున్నారు.
Similar News
News December 14, 2025
నెల్లూరులో ఫ్రెండ్‌నే మోసం చేశాడు..!

ఫ్రెండ్‌నే మోసం చేసిన ఘటన ఇది. నెల్లూరులోని ఆచారి వీధికి చెందిన షేక్ అమీర్ అహ్మద్, కోటమిట్టకు చెందిన ఎండీ అర్షద్ అహ్మద్ స్నేహితులు. బంగారం వ్యాపారం చేసే అర్షద్.. ఈ బిజినెస్‌లో పెట్టుబడితే బాగా లాభాలు వస్తాయని నమ్మించాడు. దీంతో అర్షద్‌కు అమీర్ రూ.3.55 కోట్లు ఇచ్చాడు. లాభాలు చూపకపోగా నెల్లూరు నుంచి అర్షద్ అదృశ్యమయ్యాడు. మోసపోయానని గ్రహించిన అమీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News December 14, 2025
విశాఖ: ముగిసిన WHIF-2025

3 రోజుల వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరం (WHIF)-2025 విశాఖలోని మేడి టెక్ జోన్‌లో శనివారం ముగిసింది. వైద్య సాంకేతిక రంగంలో గ్లోబల్ సహకారం, ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఫోరం పిలుపునిచ్చింది. ఫోరంలో గ్లోబల్ మెడ్‌టెక్ ఎక్స్‌పో,మెడ్‌టెక్ సిల్క్ రోడ్,స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్,ఆరోగ్య రంగంలో మీడియా పాత్రపై చర్చించారు. 6వేల మందికి పైగా ప్రతినిధులు, 200కిపైగా ప్రసంగకర్తలు,100కిపైగా ఎగ్జిబిటర్లు వచ్చారు.
News December 14, 2025
నర్సాపూర్(జి): ‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’

ఓటు విలువపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో నర్సాపూర్(జి) మండల కేంద్రానికి చెందిన MD. జాబీర్ అనే యువకుడు తన ఇంటి గోడపై ప్రత్యేక సందేశాన్ని రాశారు. “ఈ ఇంటి ఓట్లు అమ్ముబడవు!” అని స్పష్టం చేస్తూ, ఓటును మతం, కులం, డబ్బు కోసం వృథా చేయవద్దని పిలుపునిచ్చారు. ఓటు ఒక ఆయుధం లాంటిదని, ప్రలోభాలకు లొంగకుండా సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.


