News February 2, 2025
అచ్చంపేట: బాలికపై బాబాయి అత్యాచారయత్నం.. కేసు నమోదు
నాగర్‌కర్నూల్ జిల్లాలో బాలికపై బాబాయి అత్యాచారానికి యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలంలోని ఓ తండాలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సొంత బాబాయి(యువకుడు) అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 3, 2025
నేటి ముఖ్యాంశాలు
* అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్
* TG: ఫిబ్రవరి 15లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్: మంత్రి పొంగులేటి
* తెలంగాణ అంటే బీజేపీకి ద్వేషం: సీతక్క
* ఈ నెల 4న కులగణనపై క్యాబినెట్ భేటీ
* AP: పెద్దిరెడ్డికే కాదు.. ఎవరికీ భయపడం: నాగబాబు
* పోలవరం ఎత్తు తగ్గింపుతో తీవ్ర నష్టం: బొత్స
* ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
News February 3, 2025
విఫలమవుతున్నా సంజూకి ఛాన్సులివ్వాలి: మంజ్రేకర్
సంజూ శాంసన్ వరసగా విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి ఎక్కువ అవకాశాలిస్తూ ఉండాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘టీ20ల్లో పరుగులెన్ని చేశారని కాకుండా ఆటగాడు ఎలాంటి ప్రభావం చూపిస్తాడో అంచనా వేయాలి. సంజూ వంటి బ్యాటర్ క్రీజులో ఉంటే మ్యాచ్ గతినే మార్చేయగలరు. ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించగలరు. ఒక్కోసారి వైఫల్యాలు వస్తాయి. అయినప్పటికీ ఓపిగ్గా ఛాన్సులిచ్చి అండగా నిలవాలి’ అని పేర్కొన్నారు.
News February 3, 2025
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘తండేల్’ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని భావించినా కొన్ని కారణాలతో రాలేకపోయారు. దీంతో చాలా కాలం తర్వాత AA స్పీచ్ విందామనుకున్న అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. అల్లు అర్జున్ వస్తారనే ఈ ఈవెంట్‌కి ఫ్యాన్స్‌కు ఎంట్రీ నిషేధించారని సినీ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.