News April 22, 2025
అచ్చంపేట: స్టేట్ ర్యాంక్ సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని

పట్టణానికి చెందిన పిట్టల దశరథం, జ్యోతిల కుమార్తె పిట్టల స్నేహిత ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 990 మార్కులతో.. స్టేట్ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన స్నేహిత భవిష్యత్‌లో ఇంజినీర్‌గా ఎదగాలి అనేది తన కోరిక అని తెలిపింది. ఆమెను కాలేజీ సిబ్బంది అభినందించారు.
Similar News
News April 23, 2025
పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం: ప్రకాశం ఎస్పీ

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్ఠ మరింత పెంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆయన మంగళవారం నియామకపత్రాలు అందజేశారు. పోలీస్ శాఖలో చేరడం గొప్ప అవకాశమన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం ముఖ్య కర్తవ్యమని సూచించారు.
News April 23, 2025
NZB: ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీలో బి.జ్యోతిర్మయి 956, బైపీసీలో మలిహ ఆర్ఫీన్ 974, బైపీసీ ఉర్దూ మీడియంలో 963 మార్కులు, ఒకేషనల్ ఎస్. పూజ 974 మార్కులు సాధించారని చెప్పారు.
News April 23, 2025
జగన్‌ను కలిసిన కడప నేతలు

మాజీ సీఎం జగన్‌ను కడప జిల్లా వైసీపీ నేతల కలిశారు. తాడేపల్లిలోని మాజీ సీఎం నివాసంలో ఇవాళ సమావేశం జరిగింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇతర నాయకులు అక్కడికి వెళ్లారు. పీఏసీలో తనకు చోటు కల్పించడంపై జగన్‌కు అంజద్ బాషా ధన్యవాదాలు తెలిపారు.