News June 12, 2024

అచ్చెన్నాయుడుకి మరోసారి మంత్రి పదవి

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లానుంచి ఒక్కరికే కేబినెట్లో చోటుదక్కింది. టెక్కలి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడుకి మరోసారి మంత్రి పదవి వరించింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. కాగా రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కడం తెలిసిందే. దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News November 27, 2024

ఎచ్చెర్ల: పీజీ కోర్సులో ఈనెల 29న స్పాట్ అడ్మిషన్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మిగులు సీట్లకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ఉదయం.10 నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఈ ప్రవేశాలు జరగనున్నాయని తెలిపారు. ఏపీ పీజీ సెట్ -2024 అర్హతతో సంబంధం లేకుండా డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 

News November 27, 2024

శ్రీకాకుళం: బాల్య వివాహాల నిర్మూలనకు అందరి సహకారం అవసరం

image

బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె వర్చువల్ విధానంలో నిర్వహించిన ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎన్ఐసి నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణా దేవి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్య వివాహ ముక్త్ భారత్ లక్ష్యం అన్నారు.

News November 27, 2024

శ్రీకాకుళంలో పెన్షన్ ఒకరోజు ముందే అందజేత

image

శ్రీకాకుళం జిల్లా వాసులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉండే పెన్షన్ దారులకు ఈనెల 30వ తేదీనే పెన్షన్ అందజేయనుంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది అందజేయనున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉండే 3.14 లక్షల మంది పెన్షన్ దారులు ఉండగా వారందరికీ ప్రభుత్వం పెన్షన్ ఒక రోజు ముందుగానే అందజేయాలని నిర్ణయించింది.